NTV Telugu Site icon

వినియోగ‌దారుల‌కు షాక్‌: భారీగా పెరిగిన చికెన్ ధ‌ర‌లు… ఇదే కార‌ణం…

స‌మ్మ‌ర్‌లో చికెన్‌కు డిమాండ్ త‌గ్గిన‌ప్ప‌ట్టికి గ‌త కొన్ని రోజులుగా చికెన్‌కు భారీ డిమాండ్ ఏర్ప‌డింది.  క‌రోనా కాలంలో రోగ‌నిరోధ‌క శ‌క్తి పెర‌గాలంటే చికెన్ తినాల‌ని నిపుణులు చెబుతుండ‌టంతో చికెన్ తీసుకునే వారి సంఖ్య భారీగా పెరిగింది.  దీంతో ధ‌ర‌లు కూడా అమాంతం పెరిగాయి.  న‌గ‌రంలో కిలో చికెన్ ధ‌ర రూ.250 ప‌లుకుతుండ‌గా, మ‌ట‌న్ ధ‌ర రూ.720కి చేరింది.  ఇక నాటుకోడి చికెన్ 700 వ‌ర‌కు ప‌లుకుతున్న‌ది.  

Read: గ్లోబల్ స్టార్ హీరోయిన్ కి.. మెగా హీరో విషెస్

సాధార‌ణ రోజుల్లో హైద‌రాబాద్ న‌గ‌రంలో రోజుకు ల‌క్ష కిలోల చికెన్ అమ్మ‌కాలు జరుగుతుండ‌గా, ప్ర‌స్తుతం ల‌క్ష‌న్న‌ర నుంచి రెండు లక్ష‌ల కేజీల చికెన్ అమ్మకాలు జ‌రుగుతున్నట్టు నిపుణులు చెబుతున్నారు.  మాములుగానే ఆదివారం రోజుల్లో చికెన్ అమ్మ‌కాలు భారీగా ఉంటాయి.  ఆదివారంతో పాటుగా ఆషాఢ‌మాసం, పైగా బోనాలు కావ‌డంతో చికెన్‌కు మ‌రింత డిమాండ్ పెరిగింది.  రాబోయో రోజుల్లో చికెన్ అమ్మకాలు మ‌రింత‌గా పెరిగే అవ‌కాశం ఉన్న‌ట్టు వ్యాపారులు చెబుతున్నారు.