గ్లోబల్ స్టార్ హీరోయిన్ కి.. మెగా హీరో విషెస్

గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా ఈరోజు తన 39వ పుట్టినరోజును జరుపుకుంటోంది. మొదట్లో హిందీ చిత్రాల్లో నటించిన ప్రియాంక చోప్రా.. ఆ తర్వాత హలీవుడ్ చిత్రాల్లో తన సత్తాను చాటుతోంది. ఇక ఏడాది పాటు ప్రేమించి.. అమెరికన్ పాప్ సింగర్‌ నిక్ జోనస్‌ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.. తనకంటే దాదాపు 10 ఏళ్ళ చిన్నవాడిని పెళ్ళాడి ఈ అమ్మడు అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది. ఇక ప్రియాంక తెలుగులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన తుఫాన్ అనే చిత్రంలో నటించింది. ఈ సినిమా హిందీలో జంజీర్ పేరుతో విడుదలైంది. అయితే తాజాగా చరణ్, ప్రియాంక చోప్రాకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశాడు. ఈ ఏడాది కూడా మీకు మరింత గొప్పగా ఉండాలని కోరాడు. చరణ్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా పూర్తిచేసే పనిలో ఉన్నాడు. అతిత్వరలోనే శంకర్ సినిమాను మొదలుపెట్టనున్నాడు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-