హైదరాబాద్ సహా తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు, మరికొన్ని చోట్ల మోస్తరు వర్షాలు పడుతున్నాయి.. ఇప్పటికే హైదరాబాద్ సహా రాష్ట్రవ్యాప్తంగా 14 జిల్లాల్లో రెడ్ అలెర్ట్ ప్రకటించింది వాతావరణశాఖ.. ఇక, ఇవాళ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.. ఈరోజు ఉదయం 8.30 గంటల వరకు వాతావరణ విశ్లేషణ ప్రకారం.. తెలంగాణలో రాగల మూడు రోజుల వాతావరణ హెచ్చరికలు జారీ చేశారు.. నిన్నటి ఉపరితల ఆవర్తనం మరియు ఈస్ట్‌వెస్ట్ షీర్ జోన్ ఈ రోజు 20°N వెంబడి సగటు సముద్రం మట్టానికి 3.1 కి.మీ నుండి 5.8 కిమీ ఎత్తు వరకు ఉత్తర ద్వీపకల్ప భారతదేశం అంతటా వ్యాపించి ఉందని.. నిన్న దక్షిణ ఒడిషా-ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరాలకు ఆనుకుని ఉన్న వాయువ్య మరియు పశ్చిమ మధ్య బంగాళాఖాతం తీరంలో ఉన్న ఆవర్తనం ప్రభావంతో ఈరోజు ఉదయం ఒడిషా మరియు దాని పరిసర ప్రాంతాల్లో ఒక అల్పపీడన ఏర్పడిందని.. ఆ అల్పపీడనానికి అనుబంధంగా ఉన్న ఆవర్తనం సగటు సముద్ర మట్టం నుండి 7.6 కి.మీ వరకు విస్తరించి ఉందని పేర్కొంది.
Read Also: Black Fungus: టెన్షన్ పెడుతోన్న బ్లాక్ ఫంగస్.. లక్షణాలు ఇవే..!
ఇక, ఈ రోజు రుతుపవన ద్రోణి అనూపఘర్, శిఖర్, గ్వాలియర్ సాత్న, పెండ్రా రోడ్, అల్పపీడన మధ్యభాగం మీదుగా ఆగ్నేయ దిశగా తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉందని తెలిపింది వాతావరణ శాఖ.. వీటి ప్రభావంతో.. రాగల మూడు రోజులు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశం ఉందని.. రాగల మూడు రోజులు తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షంతో పాటు అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది.. ఇక, ఈరోజు అత్యంత భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది వాతావరణ శాఖ. కాగా, ఈ సీజన్‌లో తొలిసారి తెలంగాణలో రెడ్ అలెర్ట్ ప్రకటించింది ఐఎండీ.. ఇవాళ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే.
