NTV Telugu Site icon

Kamareddy Master Plan: మాస్టర్ ప్లాన్ పై నేడు మరో సారి హైకోర్టులో విచారణ.. రైతుల్లో ఉత్కంఠ

Kamareddy Master Plan

Kamareddy Master Plan

Kamareddy Master Plan: కామారెడ్డిలో టెన్షన్ మళ్ళీ మొదలైంది. నేడు హై కోర్టులో కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ప్రతిపాదనపై మరో సారి విచారణ జరగనుంది. ప్రభుత్వం కౌంటర్ కు సమయం కోరడంతో విచారణ నేటికి వాయిదా పడ్డ విషయం తెలిసిందే.. తమను సంప్రదించకుండా పంట భూములను రిక్రియషన్ జోన్ గా ప్రతిపాదించడాన్ని సవాలు చేస్తూ రామేశ్వర్ పల్లి రైతులు హైకోర్టు మెట్లు ఎక్కారు. తెలంగాణ ప్రభుత్వం, టౌన్ ప్లానింగ్ డైరెక్టర్, మున్సిపాల్ కమీషనర్, మున్సిపల్ చైర్మన్, జిల్లా కలెక్టర్ ప్రతివాదులుగా అందులో చేర్చారు. న్యాయవాది సృజన్ కుమార్ రెడ్డి రైతుల తరపు వాదనలు వినిపించనున్నారు. హై కోర్టు విచారణపై రైతుల్లో ఉత్కంఠ నెలకొంది.

Read also: Kerala: వివాదంలో యూత్ ఫెస్టివల్ సాంగ్.. విచారణకు కేరళ ప్రభుత్వం ఆదేశం..

నూతన మాస్టర్ ప్లాన్ ప్రతిపాదనలకు వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. నేడు మున్సిపల్ కార్యాలయం ఎదుట రైతుల మహా ధర్నా నిర్వహించనున్నారు. ఈ ధర్నాకు 7 విలీన గ్రామాల రైతులు తరలిరానున్నారు. నేటితో అభ్యంతరాలకు తుదిగడువు ముగియనుంది. 1050పైగా ఇప్పటి వరకు అభ్యంతరాలు వచ్చాయి. రైతుల ధర్నాకు పోలీసులు అనుమతి లేదంటున్నారు. మున్సిపల్ ముట్టడి దృష్ట్యా.. పోలీసుల ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. విలీన గ్రామాల రైతులను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. మున్సిపల్ ముట్టడికి అనుమతి లేదంటున్న పోలీసులు. 30 పోలీస్ యాక్టు అమల్లో ఉందని ప్రకటించారు. పోలీసుల తీరుపై రైతన్నల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేపు కౌన్సిల్ సమావేశంపై సస్పెన్స్ కొనసాగుతున్నాయి.

Read also: Without Makeup: మేకప్‌ లేకుండా మెరిసిపోవాలంటే.. ఈ టిప్స్‌ మీకోసం.

కామారెడ్డి మాస్టర్‌ ప్లాన్‌ పై జనవరి 8న రైతు జే.ఏ.సి. అత్యవసర సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే.. కామారెడ్డి జిల్లా వడ్లూరు, ఎల్లా రెడ్డిలో మాస్టర్ ప్లాన్ బాధిత రైతులు సమావేశమయ్యారు. ఈసమావేశానికి 7 ఏడు గ్రామాల రైతులు హాజరయ్యారు. మాస్టర్ ప్లాన్ వివాదంపై ఎమ్మెల్యే గంప గోవర్ధన్, కలెక్టర్ జితేష్ పాటిల్ ప్రకటనపై పునరాలోచనలో పడ్డరైతులు.. భవిష్యత్ కార్యచరణ రైతు జే.ఏ.సి. ప్రకటించింది. రైతు జే.ఏ.సి. కార్యాచరణపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేదానిపై ఉత్కంఠం నెలకొన్న నేపథ్యంలో.. ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. రేవు ఉదయం నుంచి 49 మంది కౌన్సిలర్లు ఇళ్లకు వెళ్లి వినతి పత్రాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు రైతులు. ఈనెల 11 తర్వాత ఉద్యమం మరింత ఉదృతం చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే.

Read also: RRR Movie: ‘నాటు నాటు’ సాంగ్‌కు గోల్డెన్ గ్లోబ్ అవార్డు

తాజాగా కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ ప్రెస్ మీట్ నిర్వహించి మాస్టర్ ప్లాన్ పై రైతులు అపోహ పడొద్దని సూచించినా.. ఫలితం లేకుండా పోయింది. డ్రాఫ్ట్ లో మార్పులు చేర్పులకు అవకాశం ఉందని స్పష్టం చేసిన రైతులు వెనక్కి తగ్గడంలేదు. డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్ మాత్రమేనని ఇదే ఫైనల్ కాదని క్లారిటీ ఇచ్చారు కలెక్టర్‌. ఈ నెల11వరకు అభ్యంతరాలు స్వీకరిస్తామని తెలిపారు కలెక్టర్‌. అవసరమైతే గడువు పెంచుతామన్నా.. మాస్టర్ ప్లాన్ పై ఇప్పటివరకు 1026 అభ్యంతరాలు వచ్చాయని, రైతులు వస్తే సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామన్నాని చెప్పిన రైతులు మాత్రం ఆందోళన ఉద్రిక్తి చేసేందుకు ముందుకు సాగుతున్నారు. 13 నవంబర్‌ 22 నుండి 11 జనవరి 23లోపు అభ్యంతరాలు ఉంటే కామారెడ్డి పురపాలక సంఘ కమిషనర్‌ కు తెలపాలని అందులో పేర్కొన్నట్లు స్పష్టం చేశారు కలెక్టర్‌. దీంతో అసంతృప్తితో వున్న రైతులు మాస్టర్‌ ప్లాన్‌ వెనక్కి తీసుకోవాలని, 11న ఉద్యమం మరింత ఉదృతం చేస్తామని ప్రకటించడం తీవ్ర ఉత్కంఠతకు దారితీస్తోంది.
Team India: ఆఖరి ఓవర్‌లో హైడ్రామా.. క్రీడా స్ఫూర్తి చాటుకున్న రోహిత్