TS DH: తెలంగాణ స్టేట్ డైరక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ గడల శ్రీనివాసరావు తన మాటలతో ఫోకస్ అవుతుంటారు. తాను తాయెత్తు మూలంగానే బ్రతికి బయటపడ్డానని చెప్పి వార్తల్లో నిలిచారు. ప్రార్థనల మూలంగానే కొవిడ్ నుంచి బయట పడ్డామని చెప్పి వార్తల్లో నిలిచారు. సీఎం కేసీఆర్ కాళ్ళుమొక్కుతానని అన్నారు. కొత్తగూడెంలో అభివృద్ధి సరిగా జరగలేదన్నారు. గడల శ్రీనివాసరావు కొత్తగూడెం శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్టు ప్రచారం కూడా సాగుతోంది. అందుకే తాను ఎక్కువ సార్లు కొత్తగూడెం నియోజకవర్గానికి వెళుతుంటారని తన దగ్గరి మిత్రలు చెబుతుంటారు. శ్రీనివాసరావు రాబోయే ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నారని.. అందుకే వాలంటరీ రిటైర్‌మెంట్‌కు దరఖాస్తు చేసుకున్నారనే ప్రచారం సాగుతోంది. తన వాలంటరీ రిటైర్‌మెంట్‌పై శ్రీనివాసరావు క్లారిటీ ఇచ్చారు.
Read also: Sreleela : ఆ సినిమా కోసం భారీ రెమ్యూనరేషన్ తీసుకోనున్న శ్రీలీల..?
తాను విఆర్ఎస్‌కు దరఖాస్తు చేశాననే ప్రచారం అవాస్తవమని ఆయన గురువారం మీడియాకు లేఖ విడుదల చేశారు. తన ఉద్యోగానికి రిజైన్ చేయబోతున్నానని, వీఆర్‌ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్నానని జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమన్నారు. తాను ఏ నిర్ణయం తీసుకున్నా తప్పకుండా మీడియాకు తెలియజేస్తానని చెప్పారు. ఇప్పటికే కొత్తగూడెంలో ప్రజలకు సేవ చేయడానికి తన వంతు కృషి చేస్తున్నట్టు చెప్పారు. రాష్ట్రంలో ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేసేందుకు సీఎం కేసీఆర్ గారు నాకు ఇచ్చిన బాధ్యతలు నెరవేర్చడమే లక్ష్యంగా ప్రస్తుతం పనిచేస్తున్నాని స్పష్టం చేశారు. అందరూ కోరుకుంటున్నట్టుగా కొత్తగూడెం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశిస్తే తప్పకుండా సీఎం ఆదేశాలని పాటిస్తానని.. అప్పటివరకు దయచేసి అసత్య ప్రచారాలు చేయొద్దని చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నానని లేఖలో స్పష్టం చేశారు.