NTV Telugu Site icon

Sangareddy: విద్యార్థుల కోసం త‌ప‌న‌.. హెడ్ మాస్టర్ వినూత్న నిర‌స‌న‌

Sangareddy

Sangareddy

పాఠ‌శాల‌కు చుట్టం చూపుగా వ‌చ్చే హెడ్ మాస్ట‌ర్ల‌ను మ‌నం ఇప్ప‌టి కాలంలో చూస్తుంటాం. పిల్ల‌లు వ‌చ్చారా చ‌దువుకుంటున్నారా అనే వారి క‌న్నా.. మ‌నం వెల్లి బ‌డిని అలా చుట్టం చూపుగా చూసుకుని వ‌ద్దాంలే మ‌న‌కెందుకు అనే వారే ఎక్కువ ఈ కాలంలో.. ప్ర‌భుత్వం నుంచి జీతం ప‌డిందా అంతే .. ఇది మ‌నం చూస్తున్న తంతు.. అయితే దీనికి విరుద్దంగా ఓహెడ్ మాస్ట‌ర్ పిల్ల‌ల‌పై చూపిన అభిమానం అంద‌రిని ఆక‌ట్టుకుంటోంది.

పిల్ల‌ల్ని బ‌డికి పంపాల‌ని ఆ హెడ్ మాస్ట‌ర్ పిల్ల‌ల త‌ల్లి దండ్రుల‌ను ఒప్పించిన తీరు అంద‌రిని మ‌న‌సు క‌రిగించేలా చేసింది. బడి మానేసిన పిల్లలను బడికి పంపేవరకూ తిరిగి వెళ్లేదేలేదంటూ వాళ్ల ఇళ్ల వద్ద ప్రధానోపాధ్యాయుడు నేలపై పడుకొని వినూత్న రీతిలో నిరసన తెలుపుతూ తల్లిదండ్రులను వేడుకున్నారు. వారి ఇంటిముందే నిర‌స‌న తెలిపి త‌ల్లిదండ్రుల అభిమానాన్ని గెలిచి పిల్ల‌ల‌ను బ‌డితీసుకెళ్లాడు ఆ హెడ్ మాస్ట‌ర్‌. ఇలాంటి హెడ్ మాస్ట‌ర్లు నూటికో కోటికో ఒక్క‌రు వుంటారు.. అందులో ఈ హెడ్ మాస్ట‌ర్ కూడా ఒక‌ర‌నే చెప్ప‌చ్చు. ఈ వినూత్న‌ నిరస ఘ‌ట‌న సంగా రెడ్డి జిల్లా పుల్కల్ మండలం ముదిమాణిక్యం గ్రామంలో చోటుచేసుకున్నది.

బడిబాట కార్యక్రమంలో భాగంగా ముదిమాణిక్యం జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల హెచ్ఎం నూలి శ్రీధర్రావు సహచర ఉపాధ్యాయులను వెంట బెట్టుకుని బడి మానేసిన పిల్లల ఇళ్లకు వెళ్లారు. 2021-22 విద్యా సంవత్సరంలో ఎనిమిదో తరగతి పూర్తి చేసిన అన్నదమ్ములు ప్రస్తుత విద్యా సంవత్సరంలో తొమ్మిదో తరగతిలో చేరాల్సి ఉంది.

అయితే అందులో ఒకరు బాల కార్మికుడిగా మారగా, మరొకరు అనారోగ్యంతో పాఠశాలలో చేర లేదు. వీరితో పాటుగా ఏడో తరగతి పూర్తి చేసుకుని ఎనిమిదో తరగతిలో చేరాల్సిన మరో విద్యార్థి కూడా బడి మానేశాడు. దీంతో హెచ్ఎం శ్రీధర్రావు విద్యార్థుల ఇళ్లకు వెళ్లి బడికి వచ్చేలా కౌన్సెలింగ్ ఇచ్చారు. తల్లిదండ్రులు ఎంతకీ వినకపోవడంతో.. ఎండలో కటిక నేలపై కూర్చుని, పడుకుని వినూత్న రీతిలో వారిని వేడుకొన్నారు. చివరకు పిల్లలను తిరిగి పాఠశాలకు వచ్చేలా చేశారు. దీంతో హెచ్ఎం శ్రీధర్రావును గ్రామస్తులు ప్రశంసించారు.

సర్కారు స్కూళ్లను బలోపేతం చేయటం, అడ్మిషన్ల సంఖ్యను గణనీయంగా పెంచటమే లక్ష్యంగా చేపట్టిన ప్రొఫెసర్‌ జయంశంకర్‌ బడిబాట కార్యక్రమం జూన్‌ 3 నుంచి ప్రారంభమైంది. ఈ ఏడాది విద్యార్థుల నమోదుపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. కాగా..బడిబాటలో కార్యక్రమంలో భాగంగా పిల్లలు బడికి రప్పించే బాధ్యతను స్కూల్ హెడ్ మాస్టర్లకు అప్పగించింది. దీంతో పిల్లలను బడికి రప్పించాలనే సదుద్దేశ్యంతో ఈ హెడ్ మాస్టర్ చేసిన నిరసన అందరికి నిదర్శనం చెప్పొచ్చు.

Prithvi-2 Missile: పృథ్వీ-2 మిస్సైల్‌ పరీక్ష విజయవంతం