సీఎం కేసీఆర్ మరోసారి మీడియాముందుకు వచ్చారు. ఈ సం దర్భంగా సీఎం మాట్లాడుతూ…. దళిత సీఎంను చేయలేదని దానికి అనేక కారణాలు ఉన్నాయన్నారు. షబ్బీర్ అలీ కూడా ఈ విషయం చెప్పారు. నా నిర్ణయాన్ని ప్రజలు ఆమోదించారు. రెండోసారి 83 సీట్ల లో మళ్లీ గెలిపించారు. లక్షా 35 వేల ఉద్యోగాలు ఇచ్చాం. మరో 78 వేల ఉద్యోగాలు ఇస్తాం అని కేసీఆర్ అన్నారు. కేంద్రం జోనల్ ఆమో దం విషయంలో కొర్రీలు పెడుతుంది. జోనల్ ఆమోదం కోసం ఎదురు చూస్తున్నాం.
ఇది పూర్తి కాగానే ఉద్యోగాల భర్తీ చేపడతామన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ బండిసంజయ్ పై విమర్శలు గుప్పించారు. గొర్ల పథకం బీజేపీది అయితే కర్ణాటకలో ఎందుకు లేదన్నారు. గొర్ల పథకం విషయంలో కేంద్రం డబ్బు ఇచ్చి ఉంటే నేను సీఎం పదవికి రాజీనామా చేస్తా అని కేసీఆర్ అన్నారు.
