NTV Telugu Site icon

Instagram Reels: ఫ్రీ చాక్లెట్స్ ఎలా తినాలో రీల్ చేశాడు.. చివరకు ఏమైందంటే..

How To Eat Choclets

How To Eat Choclets

Instagram Reels: యువతను ఆకట్టుకునే సోషల్ మీడియా సైట్లలో ఇన్‌స్టాగ్రామ్ నంబర్ వన్. ఇన్‌స్టాగ్రామ్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లతో ఆకట్టుకుంటోంది కాబట్టే బాగా పాపులర్ అయింది. ఇన్‌స్టాగ్రామ్‌లో యూజర్లను ఎక్కువగా ఆకర్షించిన ఫీచర్లలో ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ఒకటి. వినియోగదారులు తమ ప్రతిభను ప్రదర్శించేందుకు రీల్స్ మంచి వేదికగా మారింది. ముఖ్యంగా ఇండియాలో టిక్‌టాక్ నిషేధం తర్వాత రీల్స్‌కు క్రేజ్ పెరిగింది. పాపులారిటీ కోసమో, సరదా కోసమో తెలియదు కానీ.. కొందరు యువకులు చేస్తున్న పనులు మాత్రం స్థానికులు మండిపడుతున్నారు. వీళ్లు చేసే రీళ్లు చూస్తుంటే వీళ్లకు ఏమైనా పిచ్చెక్కిందా? అన్నాకూడా సందేహం లేదు. ఓ యువకుడు వెరైటీగా చేద్దామనుకున్నాడో.. ఏమో తెలియదు గానీ.. డీమార్ట్‌కి వెళ్లి బిల్లు కట్టకుండా దొంగతనం చేసి అక్కడే చాక్లెట్ తినడం ఎలా? అనే టైటిల్‌తో పెట్టి రీల్స్ చేశాడు. దీంతో ఆ రీల్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో యజమానులు కేసు నమోదు చేసి అతడ్ని, సన్నిహితులను కూడా అదుపులోకి తీసుకున్నారు.

ప్రముఖ డీమార్ట్ షోరూమ్‌లో చాక్లెట్లను ఎలా దొంగిలించాలో, బిల్లు కట్టకుండా ఎలా తప్పించుకోవాలో తెలిపే వీడియోను హనుమాన్ నాయక్ పోస్ట్ చేశారు. అది వైరల్ అయింది. ఇలాగే వదిలేస్తే డీమార్ట్ కు వచ్చేవాళ్లంతా చాక్లెట్లు తిని డబ్బులు కట్టకుండా వెళతారనే భయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అసలు విషయం బయటకు వచ్చింది. 22 ఏళ్ల హనుమాన్ నాయక్ ఇటీవల తన స్నేహితులతో కలిసి షేక్‌పేట్‌లోని డీమార్ట్ సూపర్ మార్కెట్‌కు వెళ్లాడు. అక్కడ అమ్మే చాక్లెట్లు డబ్బులు చెల్లించకుండా ఎలా తింటున్నారో చూపించి ఫేమస్ అవ్వాలనుకున్నాడు. అందులో భాగంగా ముందుగా ఓ రెండు చాక్లెట్లు తీసుకుని షర్టు తీసుకున్నాడు.. అక్కడే వున్న గదిలోకి వెళ్లాడు. ఆ గదిలో ఆ రెండు చాక్లెట్లు తిన్న తర్వాత.. చాక్లెట్ కవర్ ను షర్ట్ లో పెట్టి, చొక్కా తెచ్చిన చోటే తిరిగి పెట్టాడు.

ఇన్‌స్టాగ్రామ్, ఇతర సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ వీడియో తెగ వైరల్ అయ్యింది. ఈ వీడియోలను గుర్తించిన డీమార్ట్ షేక్‌పేట బ్రాంచ్ మేనేజర్ అర్జున్‌సింగ్ బుధవారం ఫిలింనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. చాక్లెట్లు దొంగిలించిన హనుమంత్ నాయక్, అతని స్నేహితులపై ఐపీసీ సెక్షన్ 420, 379, ఐటీ చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే.. ఏ మార్ట్ లో అయినా ఎక్కడైనా సరే సీసీ ఫోటేజ్ లు ఉంటాయి. అది అందరికి తెలసిన నిజం. కానీ.. మనం బట్టలు వేసుకునే ట్రైల్ రూం లో మాత్రం సీసీ కెమెరాలు వుండవు. దీంతో ఈ లాజిక్ ని హనుమంతుడు వాడుకోవాలని అనుకున్నాడు. రీల్స్ చేసి వ్యూస్ పెంచుకోవాలని అనుకున్నాడు కానీ.. పోలీసులకు చిక్కాడు. అందుకే రీల్స్ చేసే ముందు కాస్త అలోచించాలి. వ్యూస్ వస్తాయి కదా అని ఎలా పడితే అలా రీల్స్ చేస్తే ఇదిగో ఈ హనుమాన్ నాయక్ లా జైలుకు వెళ్లడం ఖాయమే మరి..
Brahmos Missiles: మరో 10 రోజుల్లో బ్రహ్మోస్ క్షిపణి లాంచర్ల ఎగుమతి..