NTV Telugu Site icon

Father Property: అయ్యో మా నాన్న చనిపోయాడు.. ఆస్తికోసం కొడుకు దారుణం

Father Property

Father Property

Father Property: ఆస్తి, డబ్బు ఉంటే చాలు కుటుంబాన్ని కడతేర్చడానికి కూడా వెనకడాటం లేదు. చిన్నప్పటి నుంచి కని పెంచిన తల్లిదండ్రులను సైతం చంపేందుకు ప్లాన్ వేస్తున్నారు. ఆస్తికోసం అల్లారు ముద్దుగా పెంచిన కన్నబిడ్డలే తల్లిదండ్రులపై కర్కసత్వాన్ని చూపుతున్నారు. వారిని చంపేస్తే వారి ఆస్థి తన సొంతం అవుతుందనే దురాశ కల్లు మూసుకుపోయేలా చేస్తుంది. తండ్రి ఆస్థి కోసం ఓ కొడుకు చేసిన దారుణం వెలుగులోకి వచ్చింది. ఆస్తికోసం తండ్రినే కడతేర్చిన ఘటన తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.

read also: Minister KTR: కేటీఆర్‌ సార్‌.. నా చెల్లెల్ని కాపాడండి ఓ అన్న ఆవేదన

రంగారెడ్డి జిల్లా యాచారం మండలం తమ్మలోనిగూడకి చెందిన కర్రె మల్లయ్యకు గ్రామంలో రెండెకరాల పొలం ఉంది. కొన్నేళ్ల క్రితం ఎకరా భూమిని విక్రయించి కొడుకు వెంకటయ్యకు రూ.30 లక్షలు, కూతురు సుగుణమ్మకు రూ.30 లక్షలు ఇచ్చాడు. అయినా కొడుకుకు ఆశ చావలేదు. ఇంకా కావాలంటూ తండ్రిని వేధించ సాగాడు. మిగిలిన ఎకర పొలాన్ని తన పేరు మీద రిజిస్ట్రేషన్‌ చేయాలని వెంకటయ్య, భార్య మంగమ్మతో కలిసి తండ్రిపై తీవ్ర ఒత్తిడి తెచ్చాడు. భౌతిక దాడులకు సైతం పాల్పడ్డారు. తన ప్రాణం పోయేంత వరకు భూమిని ఇచ్చేది లేదని మల్లయ్య తేల్చి చెప్పాడు. దీంతో తండ్రిని మట్టుబెట్టాలని పథకం వేశాడు కొడుకు. ఈ క్రమంలో శనివారం అర్ధరాత్రి భార్యాభర్తలు కలిసి మల్లయ్య పడుకుంటున్న సమయంలో మొహంపై దిండు పెట్టి శ్వాస ఆడకుండా చంపేశారు. ఆదివారం తెల్లవారుజామున ఏమీ తెలియనట్టు ‘అయ్యో.. మా నాన్న చనిపోయాడు’అంటూ విలపించాడు. తండ్రీ కొడుకుల మధ్య భూవివాదం నడుస్తున్న సంగతి తెలిసిన గ్రామస్తులకు అనుమానం వచ్చి వెంకటయ్యను చితకబాదారు. పోలీసులు విచారించగా భూమి కోసం తండ్రిని హత్య చేసినట్టు అంగీకరించాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ లింగయ్య తెలిపారు.
Vuyyuru Bike Race culture: ఉయ్యూరుకి విస్తరించిన బైక్ రేసింగ్.. పేరెంట్స్ టెన్షన్