Site icon NTV Telugu

Harshavardhan Reddy : మంత్రి జూపల్లి కృష్ణారావు పచ్చి అబద్ధాలు చెబుతున్నారు

Beeram Harshavardhan Reddy

Beeram Harshavardhan Reddy

మంత్రి జూపల్లి కృష్ణారావు పచ్చి అబద్ధాలు చెబుతున్నారన్నారు బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే హర్ష వర్ధన్ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కొల్లాపూర్ లో మల్లేష్ ఆనే బీఆర్‌ఎస్‌ కార్యకర్తది రాజకీయ హత్య కాకపోతే.. జూపల్లి ఆ కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదు..? అని ఆయన వ్యాఖ్యానించారు. హత్యపై డీజీపీకి ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు సరైన రీతిలో విచారణ చేయడం లేదన్నారు హర్షవర్ధన్‌ రెడ్డి. మల్లేష్ హత్య ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులను సచివాలయంలో పక్కన కూర్చో పెట్టుకుని మాట్లాడారు జూపల్లి కృష్ణారావు అని ఆయన మండిపడ్డారు.

 

అంతేకాకుండా.. హత్య విచారణను ప్రభావితం చేసేలా జూపల్లి తీరు ఉందని, ఆ కుటుంబాన్ని పరామర్శించే ధైర్యం లేదు జూపల్లి కృష్ణారావుకి అని ఆయన అన్నారు. కేటీఆర్‌పై జూపల్లి కృష్ణారావు విమర్శలు రాజకీయ దిగజారుడుతనం అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మల్లేష్ హత్య వెనుక జూపల్లి కృష్ణారావు అనుచరులు ఉన్నారని, మల్లేష్ కుటుంబానికి బీఆర్‌ఎస్‌ పార్టీ అండగా ఉంటుందన్నారు.

Exit mobile version