Site icon NTV Telugu

Harish Rao : మంత్రి హ‌రీశ్ రావు వ‌రంగ‌ల్ షెడ్యూల్‌

Harishrao Copy

Harishrao Copy

మంత్రి హరీశ్‌రావు వ‌రంగ‌ల్ పర్యట‌నకు షెడ్యూల్ ఖ‌రారైంది. ఇవాళ , రేపు ఉమ్మడి జిల్లాలో ఆరోగ్య కార్యక్రమాలను సమీక్షించడానికి రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి హరీశ్‌రావు పర్యటిస్తారు.

మంత్రి హ‌రీష్ రావ్ షెడ్యూల్ :

* ఇవాళ‌ ఉదయం 10:30 గంటలకు భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని జిల్లా ఆసుపత్రి ప్రారంభంతోపాటు, మరో 50 పడకల ఆయూష్‌ ఆసుపత్రి నిర్మాణం, డయాగ్నోస్టిక్‌ హబ్‌, 20 పడకల న్యూబర్న్‌ కేర్‌ యూనిట్‌కు శంకుస్థాపన చేస్తారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతారు.

* మధ్యాహ్నం 12గంటలకు కేటీపీపీ జెన్‌కో సమావేశ మందిరంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు.

* సాయంత్రం 4.15 గంటలకు హనుమకొండ కలెక్టర్‌ కార్యాలయంలో ఎంజీఎం, కేఎంసీ సూపర్‌స్పెషాలిటీ, సీకేఎం, జీఎంహెచ్‌, టీబీ ఆసుపత్రుల సూపరింటెండెంట్లు, వైద్యవిభాగాధిపతులు, ఆర్‌ఎంవోలతో సమీక్షా సమావేశం. రాత్రికి రాంనగర్‌లోని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు నివాసంలో బస చేయ‌నున్నారు.

* మంగళవారం ఉదయం మహబూబాబాద్‌ జిల్లా కేంద్రానికి వెళతారు. ఉదయం 10.30 గంటలకు జిల్లా ఆసుపత్రి నిర్మాణానికి, ఏరియా ఆసుపత్రిలో రేడియాలజీ ల్యాబ్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. ఆసుపత్రిలోని 41 పడకల జనరల్‌ వార్డు, పిల్లల ఐసీయూ వార్డు, అదనపు అంతస్తు భవన సముదాయం, పడకలను ప్రారంభిస్తారు. నిర్మాణంలో ఉన్న నర్సింగ్‌ కళాశాలను సందర్శించి పనుల పురోగతిని పరిశీలిస్తారు.

* 11 గంటలకు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వ‌హించి, సాయంత్రం 6 గంటలకు హనుమకొండలోని ఎస్వీఎస్‌ గ్రూప్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొంటారు. రాత్రి 7 గంటలకు రోడ్డు మార్గాన హైదరాబాద్‌కు తిరిగి ప‌య‌నమ‌వుతారు మంత్రి హ‌రీశ్ రావ్‌.

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

Exit mobile version