Site icon NTV Telugu

Harish Rao : బ‌డ్జెట్ పెరిగింది.. ప‌నితీరు పెర‌గాలి..

నిలోఫ‌ర్‌, గాంధీ వైద్యుల‌తో వైద్యారోగ్య శాఖ మంత్రి హ‌రీశ్ రావు వీడియోకాన్ఫ‌రెన్స్‌ నిర్వహించారు. విభాగాల‌ వారీగా నెల‌వారీ స‌మీక్షలో భాగంగా ఆయన వైద్యాధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బ‌డ్జెట్ పెరిగింది.. ప‌నితీరు పెర‌గాలని ఆయన అన్నారు. ప్ర‌భుత్వం అన్ని విధాల స‌హ‌క‌రిస్తుందని, పేద‌ల‌కు నాణ్య‌మైన వైద్య సేవ‌లు అందించాలని ఆయన అధికారులకు, వైద్యులకు అదేశించారు. అంతేకాకుండా న‌వ‌జాత శిశువుల సంర‌క్ష‌ణ‌పై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ చూపాలని ఆయన సూచించారు.

మోకాలు, తుంటి ఎముక‌ల మార్పిడి స‌ర్జ‌రీలు పెర‌గాలని ఆయన వెల్లడించారు. సి-సెక్ష‌న్లు త‌గ్గాలి, సాధార‌ణ ప్ర‌స‌వాలు పెర‌గాలని ఆయన తెలిపారు. ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే విధంగా వైద్య వ్యవస్థలో మార్పులు తీసుకురావాలన్నారు. రోగికి శ్రద్ధతో చికిత్స నిర్వహించాలని, విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. మెరుగైన వైద్య సేవలు అందించడంలో తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తోందన్నారు.

https://ntvtelugu.com/balka-suman-react-on-radisson-pub-police-raid/

Exit mobile version