NTV Telugu Site icon

తెలంగాణ చరిత్రను మలుపు తిప్పిన రోజు: హరీష్‌రావు

2009,డిసెంబర్‌ 9ని తెలంగాణ ప్రజలు ఎవ్వరూ మర్చిపోరు.తెలంగాణ అస్థిత్వానికి గుర్తింపు లభించిన రోజు. రాష్ట్ర సాధన కోసం ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న తరుణంలో కేంద్రం తలదించక తప్పని రోజు. తాను సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో అంటూ ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమరణ దీక్ష బలంగా మారి యావత్ దేశాన్ని తెలంగాణ వైపు తిప్పేలా చేసిన రోజు. దీంతో అప్పటి యూపీఏ ప్రభుత్వం గంటల తరబడి కేసీఆర్‌ దీక్షపై చర్చలు జరిపింది. రాత్రి అయినా తెలంగాణ పై ఎలాంటి ప్రకటన చేయలేదు. చివరికి రాత్రి11.30కి తెలంగాణకు అనుకూలంగా అప్పటి హోం మంత్రి చిదంబరం ప్రకటన చేశారు.

ఈ సందర్భంగా నాటి రోజులను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హారీష్‌ రావు గుర్తు చేసుకుంటూ ట్విట్టర్‌ వేదికగా స్పందించారు.”తెలంగాణ చరిత్రను మలుపుతిప్పిన రోజు ఇది.ప్రాణాలను ఫణంగా పెట్టిన ధీక్షాదక్షుడి నాయకత్వంలో.. ఉద్యమం విజయతీరాలకు చేరిన రోజు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని సగర్వంగా నిలిపిన రోజు. తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో…! అన్న ఉద్యమ వీరుని ప్రస్థానంకి నేటి తో పన్నేడేండ్లు..” అంటూ హరీష్‌ రావు ట్వీట్‌ చేశారు.