Telangana Assembly: అసెంబ్లీకి ఆటోలో వచ్చిన బీఆర్ఎస్ నేతలు.. మండలిలో నిరసన..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Assembly:ఆటో డ్రైవర్లపై ప్రభుత్వ తీరుకు నిరసనగా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆటోల్లో అసెంబ్లీకి చేరుకున్నారు. ఎమ్మెల్యేలు హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, సుధీర్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, మల్లార్ రెడ్డి, వివేకానంద, మాధవరం కృష్ణారావు, పాడి కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్… హైదరాబాద్ హైదర్ గూడలోని ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి ఆటోల్లో అసెంబ్లీకి వచ్చారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆటో డ్రైవర్ల జీవితాలు రోడ్డున పడ్డాయన్నారు. రెండు నెలల్లో 21 మంది ఆటో కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడాన్ని స్వాగతిస్తున్నామని, అయితే ఆటో కార్మికులను కూడా ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. డిమాండ్ లేకపోవడంతో 6.5 లక్షల మంది ఆటో కార్మికులు ఈఎంఐ చెల్లించలేక పస్తులుంటున్నారని వెల్లడించారు. చనిపోయిన డ్రైవర్ల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆటో కార్మికులకు నెలకు రూ.10 జీవనభృతి కల్పించే విధంగా ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న బడ్జెట్ లో పొందుపర్చాలి.
Read also: HMDA Siva Balakrishna: శివ బాలకృష్ణ కేసులో కీలక మలుపు.. ఐఏఎస్ అధికారి పేరు..!
Also Read
- Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
- Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
- Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
- Bollaram Army Weapons Theft: బొల్లారం ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. లోపలి వ్యక్తులే సూత్రధారులు
బీఆర్ఎస్ నిరసన..
మండలి సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు సీఎం రేవంత్‌రెడ్డి క్షమాపణ చెప్పాలని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలు డిమాండ్ చేశారు. కౌన్సిల్ పోడియం వద్ద నిరసన తెలిపారు. నల్ల కండువాలతో నిరసన తెలిపారు. దీంతో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సభను పది నిమిషాల పాటు వాయిదా వేశారు. సీఎంపై ఫిర్యాదును అసెంబ్లీ కార్యదర్శికి పంపినట్లు మండలి చైర్మన్ తెలిపారు. కాగా, మండలి సభ్యులను ముఖ్యమంత్రి అవమానించారని ఎమ్మెల్సీ భాను ప్రసాద్ అన్నారు. వెంటనే క్షమాపణలు చెప్పాలన్నారు. సభా గౌరవాన్ని కాపాడాల్సిన ముఖ్యమంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ మోతె శోభన్ రెడ్డిని అసెంబ్లీలోకి నల్ల కండువాలు తీసుకువస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. నల్ల కండువాలు ధరించి రావొద్దని చెప్పారు. దీంతో ఎమ్మెల్సీలు, మార్షల్స్ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. నిరసన తెలపడం తమ హక్కు అని, సస్పెండ్ చేయాలని కోరితే ఎమ్మెల్సీలు భానుప్రసాద్, శోభన్ రెడ్డి, తాతా మధు, మహమూద్ అలీ సభ లోపలికి వెళ్లారు.
Pakistan : పాకిస్తాన్ ఎన్నికల్లో ఓడిపోయిన మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్
- Tags
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!