NTV Telugu Site icon

Harish Rao: ట్విట్టర్, ఫేస్ బుక్ లో రిక్వెస్ట్ పెట్టండి.. కాలనీకే కంటి వెలుగు..

Harish Kanti Velugu

Harish Kanti Velugu

Harish Rao: ట్విట్టర్, ఫేస్ బుక్ లో రిక్వెస్ట్ పెట్టండి చాలు మీ కాలనీకే కంటి వెలుగు వస్తుందని మంత్రి హరీష్‌ రావు అన్నారు. అమీర్ పేటలో ఇవాళ రెండో విడత కంటి వెలుగును మంత్రులు హరీష్, తలసాని ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రజల వద్దకు వెళ్లి సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. గతంలో 8 నెలల్లో మొదటి విడత పూర్తి చేశామన్నారు. ఇప్పుడు వంద రోజుల్లో రెండో విడత నిర్వహించడం జరిగిందని అన్నారు. కాలనీకే కంటి వెలుగు బృందాలు వస్తాయని తెలిపారు. చివరి మనిషి వరకు కంటి పరీక్షలు చేస్తామన్నారు. ట్విట్టర్, ఫేస్ బుక్ లో రిక్వెస్ట్ పెట్టండి చాలని, తెలంగాణలోని ప్రతి పథకం దేశానికే దిక్సుచి అని వ్యాఖ్యానించారు.

Read also: Income Tax Raids: హైదరాబాద్ లో రెండో రోజు ఐటీ రైడ్స్.. రియల్ ఏస్టేట్ ప్లాట్ల విక్రయాలపై ఆరా

ఇతర రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం తెలంగాణ పథకాలను అనుసరిస్తున్నాయని తెలిపారు మంత్రులు. ఢిల్లీ, పంజాబ్ ముఖ్యమంత్రులు ఇక్కడ చూసి వాళ్ళ రాత్రల్లో కంటి వెలుగు అమలు చేస్తామని చెప్పారని అన్నారు. మెడిన్.. తెలంగాణ అద్దాలు.. ఈ సారి పంపిణీ చేయనున్నామని ఆనందం వ్యక్తం చేశారు. సంగారెడ్డిలోనే కంటి అద్దాలు తయారుకావడం ఈ సారి ప్రత్యేకమన్నారు. పార్టీలకు అతీతంగా కంటి వెలుగుని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. నేటి నుంచి కంటి వెలుగు ప్రారంభమైందని అన్నారు. 1500 స్క్రీనింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. కంటి పరీక్షలు నిర్వహించనున్న 15 వేల మంది సిబ్బందిని ఏర్పాటు చేశామని, 100 రోజుల్లో కోటిన్నర మందికి పరీక్షలు చేయాలని టార్గెట్ అన్నారు మంత్రులు. కంటి వెలును ప్రజలందరు ఉపయోగించుకోవాలని కోరారు.
Blocked Jagityala: అష్టదిగ్బందంలో జగిత్యాల.. మాస్టర్ ఫ్లాన్ పై నిరసనలు