Harish Rao: ఆటో EMI కట్టలేకపోతున్నాం.. హరీష్ రావుతో ఆటో డ్రైవర్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad MMTS: సంగారెడ్డి జిల్లా పఠాన్ చెరువులో మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు పర్యటించారు. పటాన్ చెరు బస్టాండ్ వద్ద ఆటో డ్రైవర్లతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు హరీశ్ రావు. ఈ సందర్భంగా పలువురు ఆటో కార్మికులు ఈఎంఐలు కూడా చెల్లించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్ణయంతో రోడ్డున పడ్డామని వాపోయారు. మాకు సహాయం చేయాలని కోరారు. ప్రభుత్వాన్ని వేడుకున్నట్లు తెలిపారు. కుటుంబ పోషణకు ఆటో నడపడం ఒక్కటే మార్గమని దిక్కని తెలిపారు. ప్రభుత్వం ద్వారా ఉచిత బస్సు మంచిదే అయినా కస్టమర్లు లేక ఆటోలు నడపలేకపోతున్నామని అన్నారు. రోజుకు రూ.100 కూడా సంపాదించే పరిస్థితి లేదని వాపోయారు. కొత్త తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదుకోవాలని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనిపై స్పందించిన హరీష్ రావు.. ఆటో డ్రైవర్లకు అండగా నిలుస్తామన్నారు. ప్రతిపక్షంలో ఉన్నా ప్రజాసమస్యల కోసం బీఆర్‌ఎస్ పోరాటం కొనసాగిస్తుందని ఆటోడ్రైవర్‌లకు హితవు పలికారు. 6.5 లక్షల మంది ఆటోడ్రైవర్ల తరపున అసెంబ్లీలో బీఆర్‌ఎస్ గళం వినిపిస్తామన్నారు. ఆత్మహత్యల వంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని సూచించారు. ప్రభుత్వం నెలకు 10 వేలు ఇచ్చే వరకు పోరాడుతామని హామీ ఇచ్చారు. ఆయన వెంట బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు, ఆటో కార్మికులు తదితరులు ఉన్నారు.
Read also: Telangana Govt: పద్మ అవార్డు గ్రహీతలకు ప్రభుత్వం సత్కారం.. ఒక్కొక్కరికి రూ.25 లక్షల నగదు
Also Read
- Bollaram Incident: ఉద్యోగంలో నుంచి తీసేశాడని కక్ష.. చిన్నారి కిడ్నాప్, హత్య..
- RTC-Metro Pass: ప్రయాణికులకు అలర్ట్.. ఆర్టీసీ -మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గింపు..!
- Indiramma Towers: గుడ్‌న్యూస్.. జిల్లాల్లో కూడా ఇందిరమ్మ టవర్స్.. రూ.4 లక్షలకే ఫ్లాట్..
- CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
KRMB విషయంలో కాంగ్రెస్ చేతులెత్తేసిందని అన్నారు. మేం గెలిచాక 15 వేల రైతుబంధు ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పిందని అన్నారు. వడ్లకు బోనస్, వృద్ధాప్య పెన్షన్ పెంపు, 2 లక్షల రుణమాఫీ చేస్తామంటూ ప్రచారం చేశారని,, ఆటో డ్రైవర్ల పొట్ట కొట్టింది..12 మంది డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారని మండిపడ్డారు.
కేసీఆర్ ప్రభుత్వంలో 24 గంటల కరెంట్ ఇస్తే ఇప్పుడు 15 నుంచి 16 గంటల కరెంటు వస్తుందన్నారు. కాంగ్రెస్ వచ్చాక ఇన్వెటర్లు, జనరేటర్లకి డిమాండ్ పెరిగిందన్నారు. గల్లీలో, ఢిల్లీలో ఎవరన్నా తెలంగాణ ప్రజల తరపున పోరాడేది BRS మాత్రమే అన్నారు. మమతా బెనర్జీ కాంగ్రెస్ పార్టీని 40 సీట్లు తెచ్చుకోమని ఛాలెంజ్ చేసిందని, ఇండియా కూటమి పని అయిపోయింది..ఒక్కొక్కరు కూటమి నుంచి బయటికి వస్తున్నారని తెలిపారు. మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చితే మేం శభాష్ అంటామన్నారు. నిరుద్యోగులకు ఫిబ్రవరి 1న గ్రూప్ నోటిఫికేషన్ ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మనకి స్పీడ్ బ్రేకర్ లాంటివన్నారు. రాజస్తాన్, ఛత్తీస్ ఘడ్ లో ఐదేళ్లకే కాంగ్రెస్ ఇంటి బాట పట్టిందన్నారు. బీజేపీ ఎంపీగా గెలిచిన బండి సంజయ్ ఒక్క రూపాయి అయినా తెలంగాణకి తెచ్చాడా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో అధికారంలో వచ్చే పరిస్థితి లేదన్నారు. రాముడు అందరి వాడు..రాజకీయంగా వాడుకొని ఓట్లు అడుగుతామంటే ఎవరు వెయ్యరన్నారు. ఏం చేశారో చెప్పుకోవడానికి ఏం లేక దేవుడి పేరుతో ఓట్లు అడుగుతున్నారన్నారు.
తాజావార్తలు
-
Jantar Mantar: ఢిల్లీ పోలీసుల సంచలన నిర్ణయం.. నిరసనల వేదికగా జంతర్ మంతర్ తొలగింపు!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
Rajahmundry Theft Case: భారీ పగటి దొంగతనం కేసు ఛేదన.. రూ.53.51 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి అకస్మాత్తుగా ఎందుకు రిటైర్ అయ్యాడు..? అసలు కథ ఇదే..
ట్రెండింగ్
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..