NTV Telugu Site icon

Harish Rao: ఆటో EMI కట్టలేకపోతున్నాం.. హరీష్‌ రావుతో ఆటో డ్రైవర్లు

Harish Rao

Harish Rao

Hyderabad MMTS: సంగారెడ్డి జిల్లా పఠాన్ చెరువులో మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు పర్యటించారు. పటాన్ చెరు బస్టాండ్ వద్ద ఆటో డ్రైవర్లతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు హరీశ్ రావు. ఈ సందర్భంగా పలువురు ఆటో కార్మికులు ఈఎంఐలు కూడా చెల్లించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్ణయంతో రోడ్డున పడ్డామని వాపోయారు. మాకు సహాయం చేయాలని కోరారు. ప్రభుత్వాన్ని వేడుకున్నట్లు తెలిపారు. కుటుంబ పోషణకు ఆటో నడపడం ఒక్కటే మార్గమని దిక్కని తెలిపారు. ప్రభుత్వం ద్వారా ఉచిత బస్సు మంచిదే అయినా కస్టమర్లు లేక ఆటోలు నడపలేకపోతున్నామని అన్నారు. రోజుకు రూ.100 కూడా సంపాదించే పరిస్థితి లేదని వాపోయారు. కొత్త తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదుకోవాలని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనిపై స్పందించిన హరీష్ రావు.. ఆటో డ్రైవర్లకు అండగా నిలుస్తామన్నారు. ప్రతిపక్షంలో ఉన్నా ప్రజాసమస్యల కోసం బీఆర్‌ఎస్‌ పోరాటం కొనసాగిస్తుందని ఆటోడ్రైవర్‌లకు హితవు పలికారు. 6.5 లక్షల మంది ఆటోడ్రైవర్ల తరపున అసెంబ్లీలో బీఆర్‌ఎస్‌ గళం వినిపిస్తామన్నారు. ఆత్మహత్యల వంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని సూచించారు. ప్రభుత్వం నెలకు 10 వేలు ఇచ్చే వరకు పోరాడుతామని హామీ ఇచ్చారు. ఆయన వెంట బీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు, ఆటో కార్మికులు తదితరులు ఉన్నారు.

Read also: Telangana Govt: పద్మ అవార్డు గ్రహీతలకు ప్రభుత్వం సత్కారం.. ఒక్కొక్కరికి రూ.25 లక్షల నగదు

KRMB విషయంలో కాంగ్రెస్ చేతులెత్తేసిందని అన్నారు. మేం గెలిచాక 15 వేల రైతుబంధు ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పిందని అన్నారు. వడ్లకు బోనస్, వృద్ధాప్య పెన్షన్ పెంపు, 2 లక్షల రుణమాఫీ చేస్తామంటూ ప్రచారం చేశారని,, ఆటో డ్రైవర్ల పొట్ట కొట్టింది..12 మంది డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారని మండిపడ్డారు.
కేసీఆర్ ప్రభుత్వంలో 24 గంటల కరెంట్ ఇస్తే ఇప్పుడు 15 నుంచి 16 గంటల కరెంటు వస్తుందన్నారు. కాంగ్రెస్ వచ్చాక ఇన్వెటర్లు, జనరేటర్లకి డిమాండ్ పెరిగిందన్నారు. గల్లీలో, ఢిల్లీలో ఎవరన్నా తెలంగాణ ప్రజల తరపున పోరాడేది BRS మాత్రమే అన్నారు. మమతా బెనర్జీ కాంగ్రెస్ పార్టీని 40 సీట్లు తెచ్చుకోమని ఛాలెంజ్ చేసిందని, ఇండియా కూటమి పని అయిపోయింది..ఒక్కొక్కరు కూటమి నుంచి బయటికి వస్తున్నారని తెలిపారు. మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చితే మేం శభాష్ అంటామన్నారు. నిరుద్యోగులకు ఫిబ్రవరి 1న గ్రూప్ నోటిఫికేషన్ ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మనకి స్పీడ్ బ్రేకర్ లాంటివన్నారు. రాజస్తాన్, ఛత్తీస్ ఘడ్ లో ఐదేళ్లకే కాంగ్రెస్ ఇంటి బాట పట్టిందన్నారు. బీజేపీ ఎంపీగా గెలిచిన బండి సంజయ్ ఒక్క రూపాయి అయినా తెలంగాణకి తెచ్చాడా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో అధికారంలో వచ్చే పరిస్థితి లేదన్నారు. రాముడు అందరి వాడు..రాజకీయంగా వాడుకొని ఓట్లు అడుగుతామంటే ఎవరు వెయ్యరన్నారు. ఏం చేశారో చెప్పుకోవడానికి ఏం లేక దేవుడి పేరుతో ఓట్లు అడుగుతున్నారన్నారు.

Top Headlines @ 1 PM : టాప్‌ న్యూస్‌ !

Show comments