Site icon NTV Telugu

Harish Rao: పంజాబ్ కి ఒక న్యాయం.. తెలంగాణకో న్యాయమా?

కేంద్రప్రభుత్వం తెలంగాణ ప్రజల పట్ల వివక్ష చూపుతోందని మండిపడ్డారు ఆర్థిక మంత్రి హరీష్ రావు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని పద్మానాయక ఫంక్షన్ హల్ లో కేంద్రం వడ్లు కొనేందుకు టీఆర్‌ఎస్ పార్టీ భవిష్యత్ కార్యాచరణపై నియోజకవర్గ స్థాయి పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. మంత్రి హరీష్ రావు, జెడ్పీ చైర్మన్ రోజా శర్మ. అనంతరం పలువురు మంత్రి సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు.

మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ఎండగట్టాలి. కేంద్రం ఎఫ్ సి ఐ ద్వారా పంట కొనుగోలు చేయాలని రాజ్యాంగంలోనే ఉంది. గతంలో చాలా మంది ప్రధానులుగా చేసిన వారు వడ్లు కొనుగోలు చేశారు. మొట్టమొదటి సారి మోడీ ప్రభుత్వం వడ్లు కొనమని మొండికేస్తుంది. పంజాబ్ లో వడ్లు కొని తెలంగాణ లో ఎందుకు కొనడం లేదని మన ఎంపీ లు ఢిల్లీలో కొట్లాడుతున్నారు. పంజాబ్ కి ఒక న్యాయం.. తెలంగాణ కు ఒక న్యాయమా అని హరీష్ రావు మండిపడ్డారు.

మద్దతు ధర వడ్లకు ఇచ్చి బియ్యం కొంటా అంటే ఎలా? బీజేపీ రైతు వ్యతిరేక విధానాలపై ప్రజలకు అవగాహన కల్పించాలి. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రైతుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను తెచ్చింది. బీజేపీ పాలించే ఏ రాష్ట్రంలో కూడా ఉచిత కరెంట్ ఇవ్వడం లేదు. ఆయిల్ ఫామ్ కోసం బడ్జెట్ లో వెయ్యి కోట్లు పెట్టాం.
బీజేపీ ఎన్నికల ముందు ధరలు తగ్గించి, ఎన్నికలు కాగానే ధరలు పెంచుతున్నారు. ఓడ ఎక్కేదాకా ఓడ మల్లన్న.. ఓడ ఎక్కాక బోడి మల్లన్న అన్న చందంగా బీజేపీ వ్యవహరిస్తుందన్నారు హరీష్ రావు.

ఎరువుల ధరలు పెంచి సబ్సిడీ తగ్గించారు. వడ్లు కొనుగోలు చేయాలని ప్రతి గ్రామాల్లో ఏక గ్రీవ తీర్మానం చేసి మోడీకి పంపాలి. పార్టీ ఆదేశాల మేరకు త్వరలో ప్రతి ఇంటిపై నల్ల జెండా ఎగుర వేయాలి. కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలపై ప్రతిచోట చర్చ జరిగే విధంగా ప్రతి కార్యకర్త పాల్గొనాలని పిలుపునిచ్చారు.

https://ntvtelugu.com/allu-arjun-special-post-on-bheemla-nayak/
Exit mobile version