Harish Rao: పెంచిన రైతు బంధు ఎప్పుడు నుంచి ఇస్తారని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు రాష్ట్ర సర్కార్ ను అడుగుతున్నామన్నారు. ప్రతిపక్షంలో ఉన్నం కాబట్టి విమర్శ చేయాలని కాదన్నారు. రైతాంగం అంతా రాష్ట్ర ప్రభుత్వం వైపు చూస్తుందని తెలిపారు. రైతులకు బోనస్ ఇస్తాం అని ఎన్నికల సమయంలో చెప్పారు బోనస్ కింది 5 వందల రూపాయలు ఇస్తాం అన్నారని తెలిపారు. వడ్లకు 5 వందల బోనస్ ఎప్పుడు ఇస్తారు? అని ప్రశ్నించారు. వడ్లు కొనుగోలు ఎప్పుడు చేస్తారు చెప్పాలి అని అడుగుతున్నామని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో రైతు బంధు పెంచుతాం అన్నారని తెలిపారు. ఎన్నికల ప్రచారంలో రైతు బంధు కింద 15 వేల రూపాయలు ఇస్తామని, డిసెంబర్ 9 న ఇస్తాం అని మాట ఇచ్చారని గుర్తు చేశారు. పెంచిన రైతు బంధు ఎప్పుడు నుంచి ఇస్తారు అని రాష్ట్ర సర్కార్ ను అడుగుతున్నామని హరీష్ రావు అన్నారు.
Read also: Bigg Boss Telugu 7: ఈ వారం ఓటింగ్ రిజల్ట్స్.. ఆ ఇద్దరు అవుట్?
బీఆర్‌ఎస్‌ఎల్పీ నేతగా కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు కాకుండా మరొకరు వస్తారనే ఊహాగానాలు ఇటీవల జోరందుకున్నాయి. కేసీఆర్ అసెంబ్లీకి రారని, పార్లమెంటు ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసి జాతీయ రాజకీయాల్లో బిజీ అవుతారని కూడా అనుకున్నారు. అయితే ఇప్పుడు కేసీఆర్ కు అలాంటి ఆలోచన లేదని తేలిపోయింది. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కేసీఆర్‌ను శాసనసభా పక్ష నేతగా ఎన్నుకున్నారు. అంటే మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీలో అడుగుపెట్టడం ఖాయం. అసెంబ్లీలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్య పోరు మొదలవుతుందని తెలుస్తోంది. కాంగ్రెస్ తీసుకుంటున్న నిర్ణయాలు, గత ప్రభుత్వ వైఫల్యాలపై చేసిన వ్యాఖ్యలు రెండు పార్టీల మధ్య మరింత అగ్గి రాజేస్తున్నాయి.
విద్యుత్ శాఖ విషయంలో గత ప్రభుత్వం మోపిన భారంపై ఇప్పటికే కాంగ్రెస్ నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. మొత్తం మీద ఈరోజు ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు… ఆసక్తికరంగా మారాయి. బీఆర్‌ఎస్ నుంచి ఈసారి అసెంబ్లీకి పోటీ చేసిన ముగ్గురు ఎమ్మెల్సీలు గెలుపొందారు. కాబట్టి వారు రెండు స్థానాల్లో ఏదో ఒక పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఈరోజు అసెంబ్లీకి రాకముందే ముగ్గురు ఎమ్మెల్సీలు శాసనమండలికి వెళ్లి రాజీనామాలు సమర్పించారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి, కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డిల రాజీనామాలను శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆమోదించారు.
Read also: Kesineni Nani: చంద్రబాబు, ఎన్టీఆర్ స్ఫూర్తితో ముందుకెళ్తున్నాం.. ఈ కార్యక్రమం నా అదృష్టం