Harish Rao: గవర్నర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరించడం.. ద్వంద్వ నీతి కాదా ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harish Rao: కాంగ్రెస్, బిజెపిల రహస్యమైత్రి మరోసారి బయటపడిందని మాజీ మంత్రి హరీష్‌రావు మండిపడ్డారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకంలో రెండు పార్టీల మధ్య ఉన్న అవగాహన బట్ట బయలు అయిందని ఫైర్ అయ్యారు. బిజెపి ఎజెండాకు అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు. కాంగ్రెస్ పార్టీకి మేలు చేసే విధంగా గవర్నర్ వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ పార్టీల్లో కొనసాగుతున్నారనే కారణంతో గత బిఆర్ఎస్ ప్రభుత్వం సిఫారసు చేసిన అభ్యర్థులను ఎమ్మెల్సీలుగా నియమించడానికి ఈ గవర్నర్ గారు నిరాకరించారని తెలిపారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏకంగా ఓ రాజకీయ పార్టీ అధ్యక్షుడినే సిఫారసు చేస్తే గవర్నర్ ఆమోదించారని తెలిపారు. ఇది ద్వంద్వ నీతి కాదా ? కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా గవర్నర్ వ్యవహరించడం కాదా ? అని ప్రశ్నించారు.
Read also: AP Governor: విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు చేశాం: అబ్దుల్ నజీర్
Also Read
- Kavitha: సిరిసిల్లకు సీఎం ఏం ఇచ్చారు?.. సర్కార్‌పై కవిత విమర్శలు..!
- Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
- Fake Form-7 Applications: బోగస్ ఫారం-7 పత్రాల కలకలం.. 31 ఓట్ల తొలగింపునకు నకిలీ దరఖాస్తులు.!
- Bribe in Dead Drop Method: డెడ్ డ్రాప్ పద్ధతిలో లంచాలు.. టౌన్ ప్లానింగ్ అధికారి సునీత ట్రాప్‌లో సంచలన విషయాలు.!
గతంలో కూడా క్రీడా , సాంస్కృతిక , విద్యా సామాజిక , సేవ రంగాల్లో కృషి చేసిన వారిని బిఆర్ఎస్ ప్రభుత్వం ఎమ్మెల్సీలుగా సిఫారసు చేసిందని గుర్తు చేశారు. అప్పుడు కూడా గవర్నర్ రాజకీయ కారణాలతో వాటిని ఆమోదించలేదని మండిపడ్డారు. మరి ఇప్పుడు ఎందుకు ఆమోదించారు? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ , బిజెపి రెండు పార్టీలు ఒక్కటై బిఆర్ఎస్ పార్టీని అనగదొక్కాలని చూస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కుట్రలో గవర్నర్ గారు స్వయంగా భాగస్వామి కావడం అత్యంత దురదృష్టకరం. న్యాయ సూత్రాలు , రాజ్యాంగ సాంప్రదాయాలు అన్ని పార్టీలకు ఒకే రకంగా ఉండాలి. కానీ బిఆర్ఎస్ కు, కాంగ్రెస్ కు తేడా చూపిస్తున్నారు.
కాంగ్రెస్ , బిజెపిల రహస్యమైత్రి మరోసారి బయటపడింది. గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకంలో రెండు పార్టీల మధ్య ఉన్న అవగాహన బట్ట బయలు అయింది. బిజెపి ఎజెండాకు అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీకి మేలు చేసే విధంగా గవర్నర్ గారు వ్యవహరిస్తున్నారు.
రాజకీయ పార్టీల్లో…
— Harish Rao Thanneeru (@BRSHarish) January 26, 2024
K.Lakshman: తెలుగు తేజాలకు పద్మ భూషణ్, పద్మ విభూషణ్ రావడం సంతోషం
తాజావార్తలు
-
vivo X Fold6: 200MP కెమెరా.. 6900mAh బ్యాటరీ.. vivo కొత్త ఫోల్డబుల్ ఫోన్ వచ్చేసింది! ఫీచర్లు అదిరిపోయాయ్
-
Nayanthara: బికినీలో నయనతార.. కానీ ఫాన్స్‌కు నిరాశే!
-
BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వం కీలక అడుగు.. న్యాయ నిపుణులతో మంత్రుల సమావేశం
-
RaviTeja – VivekAthreya : రవితేజ ‘తులాభారం’లో తూగబోయే నటీనటులు వీరేనట
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
ట్రెండింగ్
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!