Harish Rao Says BRS Will Come In Power Again With 100 Seats: 90 నుండి 100 స్థానాలతో బీఆర్ఎస్ మూడోసారి అధికారంలోకి వస్తోందని.. హ్యాట్రిక్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని మంత్రి హరీశ్ రావు ధీమా వ్యక్తం చేశారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలో నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఈడీలు, సీబీఐలు ఎన్ని విధాలుగా ఇబ్బంది పెట్టినా తమకు బీఆర్ఎస్ కార్యకర్తల బలం ఉందని అన్నారు. బీజేపీ మమ్మల్ని ఏమీ చేయలేదని తెగేసి చెప్పారు. బీఆర్ఎస్ అంటే.. బీదలు, రైతులు, సామాన్యుల పార్టీ అని అభివర్ణించారు. మన పక్కనే ఉన్న కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల్లో ఆసరా పెన్షన్లు గానీ, కల్యాణ లక్ష్మి గానీ లేదని అన్నారు.
Minister KTR: కేసీఆర్ 100 సీట్లు అన్నారు.. అందరూ మమేకం అవ్వాలి
బీజేపీకి ఆదానియే దోస్తు, మన రైతు ఆ పార్టీకి దోస్తు కాడని చెప్పడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలదా? అని హరీశ్ రావు ప్రశ్నించారు. ఆదాని ఆస్తులు పెంచే నిర్ణయాలు కేంద్ర ప్రభుత్వానివి అని, ఆమ్ ఆద్మీ సంపద పెంచే నిర్ణయాలు బీఆర్ఎస్ ప్రభుత్వానివి అని తేడాలు తెలియజేశారు. అదాని ఆమ్దానీ (సంపద) పెంచే పార్టీ కావాలా? అన్నదాత ఆమ్దానీ పెంచే బీఆర్ఎస్ కావాలా తేల్చుకోవాలని సూచించారు. నెత్తి, కత్తి లేని వాళ్ళు నత్తి మాటలు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ప్రగతి భవన్, సచివాలయాలను కులుస్తామన్న పార్టీలు.. మన తెలంగాణకు అవసరమా? అని ప్రశ్నించారు. కర్ణాటకలో త్వరలోనే ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. హిందూ, ముస్లింల మధ్య పగను రెచ్చగొట్టి, రాజకీయం చేయాలని బీజేపీ పార్టీ ప్రయత్నిస్తోందని హరీశ్ రావు ఆరోపణలు చేశారు.
Niharika Konidela: చమ్కీల చీరకట్టి.. మెగా డాటర్ మెరిసిపోతుందిలా
అంతకుముందు.. తమిళనాడు తరహాలో రిజర్వేషన్ ఇవ్వాలని బీఆర్ఎస్ ఎంపీలు ఢిల్లీలో కొట్లాడుతున్నారని హరీశ్ రావు పేర్కొన్నారు. తెలంగాణలోనూ ఎస్టీలకు రిజర్వేషన్ కావాలని పోరాడుతున్నామని తెలియజేశారు. గతంలో రాష్ట్రంలో కరెంటు సరిగ్గా ఉండేది కాదని, దాంతో వ్యవసాయానికి కష్టం అయ్యేదని.. కానీ ఇప్పుడు ప్రభుత్వం 24 గంటలు కరెంటు ఇవ్వడంతో పాటు ఎకరాకి వేల రూపాయల ఆర్థిక సాయం అందిస్తోందని తెలిపారు. రైతు భీమా ఇస్తున్న ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్ అని చెప్పారు. అనేక సంక్షేమ పథకాలు అందిస్తూ.. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. ఇంటి అడుగుజాగాలో ఇల్లు కట్టుకునే వారికి.. త్వరలోనే ఆర్థిక సహాయం అందిస్తామని భరోసా ఇచ్చారు.