NTV Telugu Site icon

Harish rao: ప్రభుత్వ ఆస్పత్రుల్లో 8 శాతం పెరిగిన ఆరోగ్య శ్రీ సేవలు

Harish Rao 1

Harish Rao 1

తెలంగాణలో  ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆరోగ్య శ్రీ సేవలు 8 శాతం పెరిగాయని ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. ఆరోగ్య శ్రీ పథకం అమలు, పురోగతిపై ఆయన నెలవారీ సమీక్ష సమావేశం నిర్వహించారు. 2019-20 ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆరోగ్య శ్రీ సేవలు 35 శాతం ఉంటే 2021-22లో 43 శాతం పెరిగాయని హరీష్ రావు అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన మేరకు పేదలకు వైద్యఖర్చులు భారం లేకుండా చేయాలని వైద్యాధికారులకు సూచించారు.

అన్ని జిల్లాలు, ఏరియా ఆస్పత్రుల్లో కాటరాక్ట్ ఆపరేషన్లు చేయాలని… చిన్ని చిన్న ఎక్విప్మెంట్ అవసరం ఉంటే కొనుగోలు చేయాలని అన్నారు. ఇదే విధంగా మోకీలు ఆపరేషన్లు అన్ని జిల్లా, ఏరియా ఆసుపత్రుల్లో చేయాలని… గాంధీ, ఉస్మానియా ఆసుపత్రుల సహకారం తీసుకోవాలని… సమీప ప్రాంతాల్లో క్యాంపులు ఏర్పాటు చేయాలని సూచించారు.

సీజేరియన్ డెలివరీలు తగ్గించి, నార్మల్ డెలివరీలు ఎక్కువగా జరిగేలా చర్యలు తీసుకోవాలని మంత్రి హరీష్ రావు వైద్యులకు సూచించారు. ఇదే విధంగా మాతా, శిశు మరణాలు పూర్తిగా తగ్గించాలని సూచించారు. డీఎంఇ, టివివిపి వైద్యాధికారులు సర్ ప్రైజ్ విజిట్స్ చేయాలి. అక్కడ అందుతున్న ఆరోగ్య శ్రీ సేవలపై సమీక్షించాలని ఆదేశించారు.