NTV Telugu Site icon

Harish Rao: కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేసింది.. బడ్జెట్‌లో వాటికి రూపాయి ఇవ్వలేదు

Harish Rao On Budget

Harish Rao On Budget

Harish Rao Responds On Central Budget 2023: ఇవాళ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై తెలంగాణ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. ఈ బడ్జెట్ తీవ్ర నిరాశను మిగిల్చిందని, తెలంగాణకు తీవ్రమైన అన్యాయం జరిగిందని వ్యాఖ్యానించారు. ఏ ఒక్క వర్గానికి కూడా మేలు చేయలేదని పేర్కొన్నారు. రైతులు, రైతు కూలీలు, ఉపాధి హామీ కూలీలు, మహిళలు, విద్యార్థుల పట్ల తీవ్రమైన నిర్లక్ష్యం చేశారన్నారు. గుజరాత్‌లోని గిఫ్ట్ సిటీకి, ఎన్నికలు జరగబోయే కర్ణాటకు మాత్రమే వరాలిచ్చి.. తెలంగాణకు ఏమీ ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన హామీలో ఉన్న గిరిజన యూనివర్సిటీ, వరంగల్ కోచ్ ఫ్యాక్టరీ, ఐటీఐఆర్, ఇండస్ట్రీయల్ కారిడార్, ఇండస్ట్రీయల్ ఇన్సెటివ్స్, మెగా టెక్స్టైల్, ఫార్మా సిటీ మొదలైన వాటి గురించి తాము అడుగుతూనే ఉన్నామని.. అయితే కేంద్రం వాటికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని తెలిపారు.

Cycling: సైక్లింగ్‌తో క్యాన్సర్ దూరమవుతుందా? నిజమెంత?

కేంద్రప్రభుత్వం ఉపాధి కూలీల పొట్ట కొట్టిందని.. ఇది చాలా బాధాకరమని హరీశ్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. రూ. 30 వేల కోట్లు కోత పెట్టారని.. అలాగే ఫెర్టిలైజర్ సబ్సిడీ విషయంలో రూ.50 వేల కోట్లు కోత పెట్టారని ఆరోపించారు. పత్తి కొనుగోలు నుండి కేంద్రం తప్పుకుందా అని అనుమానం కలుగుతుందని సందేహం వ్యక్తం చేశారు. ఈ సంవత్సరం సీసీఐకి పత్తి కొనుగోలు విషయంలో బడ్జెట్‌లో పూర్తి స్థాయిలో కోత పెట్టారని వెల్లడించారు. గతంలో 157 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఇచ్చిన కేంద్రం.. తెలంగాణకు మాత్రం అన్యాయం చేసిందని, రాష్ట్రానికి ఒక్క ఒక్క మెడికల్ కాలేజీ కూడా ఇవ్వలేదని అన్నారు. నర్సింగ్ కాలేజీ ఏర్పాటులో కూడా మొండి చేయి చూపారన్నారు. తెలంగాణ పట్ల బీజేపీ ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపిస్తోందన్నారు. అసలు తెలంగాణకు ఏమిచ్చారు? రాష్ట్రానికి ఎందుకు ఇవ్వడం లేదు? అని ప్రశ్నల వర్షం కురిపించారు.

Mytri Movie Mekars: మరో ‘వార్’ కన్ఫామ్ రా.. ఫిక్స్ చేసేసుకోండి

తెలంగాణ రాష్ట్రానికి, రైతులకు, రైతు కూలీలకు అన్యాయం చేశారని.. ఇది అందరినీ తీవ్ర నిరాశను మిగిల్చిందని హరీశ్ రావు వాపోయారు. పెట్రోల్, డీజిల్‌పై సెస్‌తో పాటు గ్యాస్ సిలిండర్ ధర తగ్గిస్తారేమోనని అనుకున్నామని.. అలాగే పేద మధ్యతరగతి మహిళలకు ఏదైనా శుభవార్త చెప్తారేమోనని భావించామని.. కానీ చివరకు నిరాశే మిగిలిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ పూర్తిగా రైతు వ్యతిరేక బడ్జెట్, నిరుద్యోగుల వ్యతిరేక బడ్జెట్, మహిళల వ్యతిరేక బడ్జెట్, రైతు కూలీల వ్యతిరేక బడ్జెట్ అని ఆరోపించారు.

Rajagopal Reddy: ఓటమి భయంతోనే కేసీఆర్ తన పార్టీ పేరు మార్చారు

Show comments