Site icon NTV Telugu

Harish Rao : అంతా సొల్లు పురాణమే.. అటెన్షన్‌ డైవర్షనే..

Harish Rao Pressmeet

Harish Rao Pressmeet

తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సిట్‌ తన దర్యాప్తును ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా మాజీ మంత్రి హరీష్‌రావును సిట్ అధికారులు 7 గంటలపాటు విచారించారు. అయితే.. విచారణ ముగిసిన అనంతరం తెలంగాణ భవన్‌కు చేరుకున్న హరీష్‌ రావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మాకు ఉద్యమాలు కొత్త కాదని, మీలాగా పారిపోలేదని ఆయన విమర్శించారు. ఈ అక్రమ కేసులు సమైక్య రాష్ట్రంలో చాలా పెట్టారని, మీరు ఇచ్చిన నోటీసు లు మా గౌరవం గా భావిస్తున్నామన్నారు. ఉదయం మీ బామ్మర్ది బాగోతం బయట పెడితే సాయంత్రం నాకు నోటీసులు ఇచ్చారన్నారు. రేవంత్ రెడ్డి నీకు దమ్ముంటే నాకు నోటీసులు ఇవ్వడం కాదని, రాజకీయంగా కోట్లాడుదాం అని ఆయన సవాల్‌ విసిరారు.
Amazon Smart Home విప్లవం.. కొత్త Eco షో సిరీస్‌తో ఇంటికి అత్యాధునిక హంగులు

నీ దోపిడీకి అడ్డు వస్తున్నామని చిల్లర రాజకీయాలు చేస్తున్నావు అంటూ ఆయన ధ్వజమెత్తారు. ప్రజలు తిరగబడే రోజులు దగ్గర లోనే ఉన్నాయని హరీష్‌ రావు వ్యాఖ్యానించారు. మాకు చట్టం మీద నమ్మకం గౌరవం ఉందని, నువ్వు ఎక్కడకు పిలిచినా వస్తానన్నారు హరీష్‌ రావు. రేవంత్ రెడ్డి చూసుకో.. నిన్ను అసలు వదిలి పెట్టను అని ఆయన అన్నారు. మళ్ళీ నైట్ ఇంకో లీక్ ఇస్తారని, దమ్ముంటే ఇవాళ నన్ను అడిగిన ప్రశ్నలు జవాబులు అన్ని బయటపెట్టు అని హరీష్‌ రావు అన్నారు. వీడియో మొత్తం బయటపెట్టు, చిల్లర లీకులు కాదు అంటూ హరీష్‌ రావు ఫైర్‌ అయ్యారు. ఈ నోటీసు లు మమ్మల్ని బయటపెట్టవని, నీ పతనాన్ని వేగవంతం చేస్తాయన్నారు హరీష్‌ రావు.

నన్ను ప్రశ్నలు అడగడం కాదని, వాళ్లకే నేను వందల ప్రశ్నలు వేశానని హరీష్‌ రావు తెలిపారు. అప్పటి డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్ లను విచారణ కు పిలవాలి అన్నానని, శివధర్ రెడ్డి, మహేందర్ రెడ్డి లను విచారణకు పిలవాలి అని డిమాండ్ చేశానన్నారు. ఫోన్ టాపింగ్ నాకేం సంబంధం.. నేను హోం మంత్రి కాదు కదా అని హరీష్‌ రావు వ్యాఖ్యానించారు. సైట్‌ విజిట్‌ సర్టిఫికేట్‌ పేరుతో జరిగిన కుంభకోణాన్ని బట్టబయలు చేశామని, చీటికి మాటికి సిట్‌లు వేస్తున్నారు కదా.. విచారణ జరిపించండని ఆయన అన్నారు. నిజాయితీపరుడివి అయితే సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించు.. టెండర్లు నాకంటే నాకంటూ మీరంతా కొట్లాడుకుంటున్నారు.. అంతా బయటపడింది అని హరీష్‌రావు అన్నారు.

Sharwanand: రామ్ అబ్బరాజు దేవుడిలా కనిపించాడు.. శర్వానంద్ ఆసక్తికర వ్యాఖ్యలు

Exit mobile version