Site icon NTV Telugu

హుజురాబాద్ ప్రచారంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన హరీశ్ రావు

హుజురాబాద్‌ ఉప ఎన్నికలో గెలిచేందుంకు టీఆర్‌ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు తమదైన శైలిలో ప్రజలను ఆకట్టుకుంటున్నారు. హుజురాబాద్‌ ఉప ఎన్నిక అన్నప్పటినుంచి అక్కడే ఉంటున్న ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు ప్రజలను టీఆర్‌ఎస్‌ కు ఓట్లు వేసేందుకు వివిధ వరాలను గుప్పిస్తున్నారు. గురువారం జమ్మికుంట మండలం మాడిపల్లిలో ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో హరీశ్‌రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ గెలవనే గెలవదు.. గెల్చినా ఈటల మంత్రి అయ్యేది ఉందా.. నియోజకవర్గ పనులు చేసేది ఉందా…? ఈ నెల 30 తర్వాత కూడా సీఎంగా కేసీఆర్ ఉంటరు. మీ పనులన్నీ ఆయన చేస్తడు. గెల్లు శ్రీను గెలిస్తే నేను అధికారులతో వస్తా.. ఇక్కడ నిలబడి మీకు ఇచ్చిన ప్రతీ హామీ నెరవేరుస్తా..’ అని అన్నారు. ఈ నెల 30 వ తేదిన హుజురాబాద్ ఉప ఎన్నిక పోలింగ్‌ జరుగనున్న విషయం తెలిసిందే.

Exit mobile version