NTV Telugu Site icon

Telangana Budget: అసెంబ్లీలో బడ్జెట్‌ ప్రవేశ పెట్టిన హరీష్‌ రావు.. ఏ రంగానికి ఎన్ని కోట్లు అంటే…

Financial Minister Harish Rao

Financial Minister Harish Rao

Telangana Budget: తెలంగాణ పద్దుల సీజన్ వచ్చేసింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్‌ను ఇవాళ అసెంబ్లీలో ఆర్థికమంత్రి తన్నీరు హరీష్ రావు ప్రవేశపెట్టారు. స‌భ‌లో సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నారు. బడ్జెట్ ప్రవేశపెట్టాలని మంత్రి హరీష్ రావుని కోరిన స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి కోరారు. అనంతరం మంత్రి హరీష్‌ రావు మాట్లాడుతూ.. తెలంగాణ ఆచరిస్తుందని దేశం అనుసరిస్తుందని దార్శనిక ప్రణాళికతో దేశ, అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ అందరికీ ఆదర్శంగా నిలుస్తోందన్నారు. సంక్షోభ సమయాల్లోనే ఆర్థిక నిర్వహణ చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో అన్ని సామాజిక వర్గాల, ప్రజల సంక్షేమంతో ముందుకు వెళుతున్నామని తెలిపారు. 2023-24 వార్షిక బడ్జెట్ ప్రవేశపెడుతున్నానని మంత్రి తెలిపారు. తెలంగాణ ఏర్పడేనాటికి ఆర్థిక ఇబ్బందులు పడ్దామని, రాష్ట్రం ఆవిర్భవించాక కేసీఆర్ పటిష్టకార్యాచరణ వల్ల జీఎస్డీపీ పెరిగిందన్నారు.

Read also:  Suspension on CI: చేర్యాల CI పై సస్పెన్షన్ వేటు.. బాధ్యతలు చేపట్టి 9 నెలల్లోనే..

అభివృద్ధి మోడల్ పై ప్రతి రాష్ట్రంలో చర్చ జరుగుతోందన్నారు. జీఎస్ డీపీ వృద్ధిరేటు పెరిగిందని, కరోనా వల్ల సంక్షోభం ఏర్పడిందన్నారు. ఈ పరిస్థితి నుంచి తెలంగాణ బయటపడిందని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణలో వ్యవసాయానికి జవజీవాలు కల్పిస్తోంది. ప్రభుత్వ కృష్టితో కరువుతో ఉన్న తెలంగాణ ఇప్పుడు సుజల స్రవంతిగా మారింది. కేసీఆర్ కృషికి రైతుజనబాంధవుడిగా మారారన్నారు. తెలంగాణలోని పథకాలను జాతీయ హోదా కల్పించమని అడిగినా కేంద్ర వివక్ష చూపిస్తోంది. కేంద్రం సాయం అందించినా, అందించకపోయినా తెలంగాణ ప్రభుత్వం ఇరిగేషన్ ప్రాజెక్టులకు భారీగా ఖర్చుచేస్తున్నామన్నారు. ఫెడరల్ స్ఫూర్తికి భిన్నంగా కేంద్రం సహకారం మనకు లభించడంలేదు. అయినా ఎక్కడా వెనకడుగు వేయకుండా ముందుకు సాగుతున్నాం.నీరాను సాఫ్ట్ డ్రింక్ కోసం నిధులు కేటాయించాం. గీత కార్మికులకు 5 లక్షలు పరిహారం కల్పిస్తున్నాం. రాష్ట్రంలో రజక సోదరులు నిర్వహించే సెలూన్లు, దోభీఘాట్లకు ప్రత్యేక రాయితీలు ఇస్తున్నామన్నారు.

Read also: MLAs poaching case: ఎమ్మెల్యేల కొనుగోలు కేసు.. సీబీఐ విచారణకు గ్రీన్ సిగ్నల్

తెలంగాణ ప్రభుత్వం బీసీ రెసిడెన్షియల్ 300 కి పెంచాం. 14 రెసిడెన్షియల్ విద్యాలయాలు ఏర్పాటుచేశాం. బడ్జెట్ లో ఆర్టీసీకి నిధులు కేటాయించని ప్రభుత్వం. జర్నలిస్టుల సంక్షేమానికి రూ.100 కోట్ల కార్పస్ ఫండ్ కేటాయింపు. అంగన్ వాడీ కార్యకర్తల ఉద్యోగాలు ఇచ్చాం. దేశంలో ఎవరూ ఇవ్వనంతగా ఎక్కువ పారితోషికాన్ని పెంచింది. చిరు ఉద్యోగులకు అత్యధిక వేతనాలు ఇస్తున్నాం. మహిళా భద్రతకు షీటీంలు ఏర్పాటుచేశాం. పోలీసు నియామకాల్లో 33 శాతం మహిళలకు అందిస్తున్నాం.మైనారిటీల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం. 8500 కోట్లు మైనారిటీలకు ఖర్చుచేశామన్నారు. బ్రాహ్మణుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం. గోపన్నపల్లిలో సంక్షేమభవనం నిర్మించాం. త్వరలో ప్రారంభం కానుంది. న్యాయవాదుల సంక్షేమానికి 100 కోట్లు కేటాయించాం. అడ్వకేట్లు, కుటుంబ సభ్యులకు ఆరోగ్య, ప్రమాద బీమా కల్పించాం.తెలంగాణ తలసరి ఆదాయం రూ. 3,17,215గా ఉందని హరీశ్ రావు ప్రకటించారు.

Read also: Peddagattu jathara: పెద్దగట్టు జాతరకు పోటెత్తిన భక్తులు.. అసౌకర్యాలు కలగకుండా చర్యలు

తెలంగాణ బడ్జెట్‌ 2,90,396 కోట్ల వ్యయం.. రెవెన్యూ వ్యయం 2,11,685 కోట్లు కాగా మొత్తం బడ్జెట్ 2 లక్షల 90 వేల 396 కోట్ల బడ్జెట్ ను ఆర్థిక మంత్రి హ‌రీశ్‌రావు రాష్ట్ర వార్షిక బ‌డ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశ‌పెట్టారు.

ఏ రంగానికి ఎన్ని కోట్లు అంటే..

* ఆయిల్ ఫామ్ కు 1000 కోట్లు
* దళితబంధు పథకానికి 17,700 కోట్లు
* బడ్జెట్ లో ఆయిల్ ఫామ్ కు 1000 కోట్లు
* నీటి పారుదల రంగం 26, 885 కోట్లు
* విద్యుత్ రంగం 12, 727 కోట్లు
* ప్రజా పంపిణీ వ్యవస్థ కు 3,117 కోట్లు
* తెలంగాణకు హరితహారం 1,471 కోట్లు
* రుణమాఫీకి రూ 6385 కోట్లు
* విద్యారంగానికి 19, 093 కోట్లు
* వైద్య ఆరోగ్య రంగం 12, 161 కోట్లు
* పెట్టుబ‌డి వ్య‌యం రూ. 37,525 కోట్లు.
* పల్లె ప్రగతి… పంచాయతీ రాజ్ శాఖకు 31, 426 కోట్లు
* పురపాలక శాఖ కు 11, 372 కోట్లు
* రైతు బంధు – 1575
* రైతు భీమా – 1589
* విద్యుత్ సబ్సిడీ – 12000కోట్లు
* బియ్యం సబ్సిడీ – 2000కోట్లు
* కేసీఆర్ న్యూట్రీషన్ కిట్ కోసం 200 కోట్లు
* ఆసర పెన్షన్లు – 12000కోట్లు
* పురపాలక శాఖ కు 11, 372 కోట్లు
* రోడ్లు భవనాలకు 2,500 కోట్లు
* పరిశ్రమల శాఖకు 4, 037 కోట్లు
* హోమ్ శాఖకు 9,599 కోట్లు
* బీసీ సంక్షేమం కోసం రూ. 6,229 కోట్లు
* మ‌హిళా, శిశు సంక్షేమం కోసం రూ. 2,131 కోట్లు.
* ఎస్సీ ప్రత్యేక నిధి కోసం రూ. 36,750 కోట్లు
* మైనార్టీ సంక్షేమం కోసం రూ. 2,200 కోట్లు
* గిరిజ‌న సంక్షేమం, ప్రత్యేక ప్రగ‌తి నిధికి రూ. 15,223 కోట్లు
* కొత్తగా నియమించబడే ఉద్యోగుల జీతభత్యాల కోసం 1000 కోట్లు
* డ‌బుల్ బెడ్రూం ఇండ్ల ప‌థ‌కానికి రూ. 12,000 కోట్లు
* ఆరోగ్య శ్రీ ప‌థ‌కానికి రూ. 1463 కోట్లు..
* ప్రణాళిక విభాగానికి రూ. 11,495 కోట్లు
* ఐటీ, క‌మ్యూనికేష‌న్ల శాఖ‌కు రూ. 366 కోట్లు
* విద్యుత్ రంగానికి రూ. 12,727 కోట్లు.
* కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ పథకానికి రూ. 3,210 కోట్లు
* ప్రణాళిక విభాగానికి రూ. 11,495 కోట్లు
* ఐటీ కమ్యూనికేషన్ల శాఖకు రూ. 366 కోట్లు
* న్యాయ శాఖకు రూ. 1,665 కోట్లు
* ఉన్నత విద్యా శాఖకు రూ. 3,001 కోట్లు
* ఎయిర్‌పోర్టు మెట్రో కనెక్టివిటీ కోసం రూ. 500 కోట్లు
Revanth Reddy: పాదయాత్రకి బయలుదేరిన రేవంత్.. హారతి ఇచ్చిన కూతురు నైనిషా..

Show comments