NTV Telugu Site icon

Harish Rao: మోడీ చెప్పేవన్నీ ‘టీమ్ ఇండియా’.. చేసేవి ‘తోడో ఇండియా’

Harish Rao On Modi

Harish Rao On Modi

Harish Rao Fires On Kishan Reddy PM Modi: ప్రధాని మోడీ చెప్పేవన్నీ టీమ్ ఇండియా అయితే.. చేసేవి మాత్రం తోడో ఇండియా అంటూ తెలంగాణ మంత్రి హరీష్ రావు ధ్వజమెత్తారు. కేవలం తమకు నచ్చిన రాష్ట్రానికి మాత్రమే కేంద్రం ప్రత్యేక ప్యాకేజీలు ఇస్తోందని, ప్రశ్నించిన రాష్ట్రాలకు మాత్రం ఇవ్వడం లేదని మండిపడ్డారు. మెదక్‌లో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీజేపీలకు దశాబ్ది ఉత్సవాలు జరపడం మింగుడుపడటం లేదని విరుచుకుపడ్డారు. నాడు ఉద్యమంలో రెండు పార్టీలు కలిసి రాలేదని, నేడు ఉత్సవాలకు రావడం లేదని పేర్కొన్నారు. బీజేపీ వాళ్ళు ప్రత్యేకంగా ఉత్సవాలు చేస్తామని కిషన్ రెడ్డి చెప్తున్నారని.. కానీ ఉద్యమంలో రాజీనామాకు ఆయన భయపడ్డాడని ఎద్దేవా చేశారు. అసలు తెలంగాణకు కేంద్రం ఏం చేసిందని ఈ ఉత్సవాలు చేస్తున్నారు? ఏం చేయలేదనే ఉత్సవాలు చేస్తావా? అంటూ కౌంటర్ వేశారు. రాష్ట్ర అవతరణను వ్యతిరేకించడం అంటే.. అమరులను అవమానించడమేనని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్లమెంట్‌కు అంబేద్కర్ పెరు పెట్టుమంటే ఎందుకు ముఖం చాటేస్తున్నారు? అని ప్రశ్నించిన మంత్రి.. ఇప్పటికైనా పార్లమెంట్‌కు అంబేద్కర్ పేరు పెట్టాలని కోరారు.

Ranga Reddy Crime News: అల్లుడి కిరాతకం.. భార్యని ఇంటికి పంపించట్లేదని..

నీతి ఆయోగ్‌ సమావేశానికి రాలేదని కిషన్‌రెడ్డి చెప్తున్నారని.. అసలు నీతి ఆయోగ్‌కు ఇజ్జత్ ఉందా? నీతి ఆయోగ్‌కు పరువు తీసింది మీరు, విలువ లేకుండా చేసింది మీరు అంటూ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. నీతి ఆయోగ్‌కు రూ.25 వేల కోట్లు ఇవ్వాలని సిఫార్సు చేస్తే.. ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని పేర్కొన్నారు. గవర్నర్, రాష్ట్రపతికి ముడిపెట్టి మాట్లాడుతున్నారని.. గవర్నర్ నామినేటెడ్ అయితే, రాష్ట్రపతి ఎన్నికవుతారని స్పష్టం చేశారు. ఇదే సమయంలో.. ఏపీకి కేంద్రం రూ.10 వేల కోట్లు ఇవ్వడంపై మంత్రి హరీష్ రావు పరోక్ష విమర్శలు గుప్పించారు. కేంద్రం కొన్ని రాష్ట్రాలపై కక్ష కడుతోందని విమర్శించారు. కేంద్రం అన్ని రాష్ట్రాలను సమానంగా చూడాలని, హక్కులను కాపాడాలని సూచించారు. బిజెపి పాలిత రాష్ట్రాలకు, వారికి వంతపాడే రాష్టాలకు ఒక తీరు.. తప్పులను ఎత్తిచూపితే మరో తీరుగా కేంద్రం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. తమకు నిధులు ఇవ్వనప్పుడు.. నీతి ఆయోగ్ మీటింగ్ ఎందుకు రావాలని నిలదీశారు.

Fungal Meningitis: ఫంగల్‌ మెనింజైటిస్‌తో వ్యాప్తితో ప్రమాదం.. హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించాలి..