Site icon NTV Telugu

Harish Rao : పీయూష్‌ గోయల్‌.. ఎనిమిది ఏళ్లుగా ఏమి పీకుతున్నావ్..?

కేంద్రమంత్రి పీయూష్ గోయల్ మరోసారి తెలంగాణ ప్రజలను అవమనపరిచేలా ఇవాళ మాట్లాడారని మంత్రి హరీష్‌రావు తీవ్రంగా అగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పీయూష్ గోయల్ కు వక్రీకరణలు అలవాటుగా మారిందని, పీయూష్ గోయల్ కు అర్థం కావడం లేదు…వ్యవసాయం చేస్తే రైతు సమస్యలు ఏమిటో ఆయనకు తెలిసేదన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా తెలంగాణలో రైతుల కోసం టీఆర్ఎస్ సర్కార్ పనిచేస్తుందని, తెలంగాణ రైతుల సమస్యను పీయూష్ గోయల్ అర్థం కావడం లేదని మండిపడ్డారు. తెలంగాణ రైతులకు పీయూష్‌ గోయల్ క్షమాపణ చెప్పాలని, తెలంగాణ రైతులను అవమానిస్తే మేము చూస్తూ ఊరుకోమని ఆయన హెచ్చరించారు. పీయూష్ గోయల్.. సబ్ కా సత్ సబ్ కా వికాస్ లో తెలంగాణ లేదా ? అని ఆయన ప్రశ్నించారు.

మాకు ధమ్కీలు ఇవ్వడం రాదని, ఐటీ, ఈడీ దాడులతో ధమ్కీలు ఇస్తుంది మోడీ సర్కార్ మాత్రమే.. ఇది మీ సంస్కృతి అని ఆయన విమర్శించారు. నూకలు తింటాం…మిమ్మల్ని గద్దె దించుతామన్నారు. ఆనాడు సమైక్య పాలకులు ఎలా మాట్లాడారో…ఇవాళ పీయూష్ గోయల్ అలా మాట్లాడ్తున్నారని, WTO ఒప్పందాలు అంటున్నారు…ఎనిమిది ఏళ్లుగా ఏమి పీకుతున్నావ్..? అని ఆయన ధ్వజమెత్తారు. పీయూష్ బెదిరింపు ధోరణిలో మాట్లాడ్తున్నారని, అధికారంలోకి రాకముందు రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్నారు…కానీ ఇప్పుడు వ్యవసాయం వ్యయము ను రెట్టింపు చేసారన్నారు. రైతులు ఉసురు పోసుకుంటున్నది బీజేఈ సర్కార్ అని ఆయన దుయ్యబట్టారు. ఎన్నికల ముందు డీజిల్, పెట్రోల్ ధరలు దించుడు…ఎన్నికల తర్వాత ధరలు పెంచుడు ..ఇది మీ విధానమన్నారు.

Exit mobile version