Site icon NTV Telugu

Harsih Rao: బీజేపీ వాళ్ళు దీక్షలు చేయాల్సింది గల్లీలో కాదు ఢిల్లీలో..

Harish Rao

Harish Rao

Harsih Rao: బీజేపీ వాళ్ళు దీక్షలు చేయాల్సింది గల్లీలో కాదు ఢిల్లీలో అని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. జహీరాబాద్ లో BRS పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్న హరీష్ రావు మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల గుండెలపై తన్నిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయిన ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు లేదన్నారు. 200 మంది ఆత్మహత్య చేసుకుంటే పరామర్శించడానికి సమయం లేదన్నారు. కేసీఆర్ హయాంలో పుట్ల కొద్ది ధాన్యం పడితే… కాంగ్రెస్ హయాంలో పుట్టెడు కష్టాలు ఎదురవుతున్నాయన్నారు. కేసీఆర్ ని తిట్టడం పక్కనపెట్టి రైతులని ఆదుకోండన్నారు. బ్యాంకు అధికారులు రైతులకు నోటీసులు ఇస్తున్నారని తెలిపారు.

Read also: Tillu Square : 100కి దగ్గరైన టిల్లు గాడు.. రంగంలోకి యంగ్ టైగర్..

రుణమాఫీ చేయలేదు, ఎకరానికి 15 వేల ఆర్థిక సహాయం చేయలేదు, పంటకు మద్దతు ధర ఇవ్వట్లేదన్నారు. కాంగ్రెస్ వంద రోజుల పాలనలో ఒక్క హామీ నెరవేర్చలేదన్నారు. కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే రైతులకు సహాయం చేయాలన్నారు. కేసీఆర్ కాలు పెట్టగానే బీజేపీ కళ్ళు తెరిచి దీక్షలు చేస్తున్నారని తెలిపారు. బీజేపీ వాళ్ళు దీక్షలు చేయాల్సింది గల్లీలో కాదు ఢిల్లీలో అని తెలిపారు. కేసీఆర్ హయాంలో పంట బాగా పడితే బీజేపీ మేము కొనము నూకలు బుక్కమని చెప్పిందని గుర్తుచేశారు. నూకలు బుక్కమని చెప్పిన బీజేపీకి ఈ ఎన్నికల్లో బుద్ది చెప్పాలన్నారు. పంట ఎండిపోయిన రైతులకు వెంటనే ఎకరానికి 25 వేల నష్ట పరిహారం ఇవ్వాలన్నారు. కాంగ్రెస్ నాయకులు చిల్లర, బోగస్ మాటలు పక్కన పెట్టి రైతుల్ని ఆదుకోవాలన్నారు. నిద్రపోతున్న ఈ మొండి ప్రభుత్వం కళ్ళు తెరిపించడానికే ఈ దీక్షలు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కళ్ళు నెత్తికెక్కాయని మండిపడ్డారు.

Read also: Smriti Irani: ఢిల్లీలో హగ్గింగ్, కేరళలో బెగ్గింగ్..

రైతు బంధు రాలేదు అంటే కోమటిరెడ్డి చెప్పుతో కొడుతా అంటున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ హయాంలో పంటలు పండటం తప్ప ఎండటం తెలియదన్నారు. కాంగ్రెస్ వచ్చింది తెలంగాణలో కరువు తెచ్చిందన్నారు. ఈ రోజు రాహుల్ గాంధీ కొత్త మేనిఫెస్టో పెడుతారట..? అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోనే నెరవేర్చలేదు… ఇంకా ఈ కొత్త మేనిఫెస్టో ఎందుకు..? అని ప్రశ్నించారు. రైతులెవరు ఆత్మస్థైర్యం కోల్పోవద్దు..రైతులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. బీఆర్ఎస్ ని టీఆర్ఎస్ గా మార్చాలని ఆలోచన చేస్తున్నారని మండిపడుతున్నరు. నా 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏ తప్పు చేయలేదన్నారు. కేసులో ఇరికించాలని కొందరు చూస్తున్నారన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తే కేసులు పెట్టే భయపెట్టే ప్రయత్నం చేస్తుందన్నారు. కార్యకర్తలు కాపాడుకునే బాధ్యత నాదన్నారు.
Congress: లోక్‌సభ అభ్యర్థుల మరో జాబితా విడుదల

Exit mobile version