NTV Telugu Site icon

Siddipet: ఆసక్తికర సన్నివేశం.. ఒకే కార్యక్రమంలో హరీష్ రావు, రఘునందన్ రావు..

Harish

Harish

Siddipet: దుబ్బాక రఘునందన్‌ రావు అడ్డా.. సిద్దిపేట హరీష్‌ రావు గడ్డ.. దుబ్బాకలో ఏ పార్టీవారు వచ్చిన రఘునందన్‌ రావుకు సహించరు. అలాగే సిద్ధిపేటకు ఎవరొచ్చినా హరీష్ రావుకు నచ్చదు. తన ప్రాంతానికి వచ్చి ఎవరైనా సరే ప్రచారం చేసిన, విమర్శలు చేసినా.. నిప్పుతో చెలగాటమే అన్నట్లు ఉంటారు ఇద్దరు నేతలు. ఇలాంటి నేతలు ఒకరికొకరు ఎదురెదురు పడితే.. నిప్పులు కణికల్లా భగభగమనాల్సిందే అని అందరూ అనుకున్నారు. కానీ వాళ్లందరి అంచనాలను తలకిందులకు చేస్తూ వీరిద్దరూ చిరునవ్వుతో అప్యాయంగా పకరించుకున్న విచిత్ర దృశ్యం చూసిన వాళ్లంతా ఆశ్చర్యపోతున్నారు.

Read also: Chandrababu: ‘నారా చంద్రబాబు నాయుడు అనే నేను’.. నాలుగో సారి సీఎంగా ప్రమాణ స్వీకారం

సిద్దిపేటలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఒకే కార్యక్రమానికి సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు, రఘునందన్ రావు పాల్గొన్నారు. ఎంపీ ఎన్నికల తర్వాత ఇద్దరు నేతలు ఎదురుపడటంతో ఒకరినొకరు నమస్కారాలు చేసుకున్నారు. ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఎంపీగా గెలిచినందుకు రఘునందన్ రావును హరీష్‌ రావు అభినందించారు. కాసేపు ఇద్దరు మాట్లాడుకున్నారు. అయితే అక్కడున్న వారందరికి ఈ సన్నివేశం చూసి మొదట షాక్‌ తిన్నా ఆ తరువాత అందరూ ఆనందం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఒకరొనొకరు ఎన్ని విమర్శలు చేసుకున్నా ఎదురుపడినప్పుడు ఆప్యాయంగా పలకరించుకోవడం అందరి దృష్టిని ఆ సన్నివేశం ఆకట్టుకుంది. శివపార్వతుల కల్యాణంలో హరీష్ రావు, రఘునందన్ రావు పక్కపక్కనే కూర్చున్నారు. దీంతో ఆప్రాంతమంతా విజిల్స్, చప్పట్లో మారిమోగింది. హరీష్ రావు, రఘునందన్ రావు అంటూ నినాదాలు జరిపారు.

Read also: Stock Market : చరిత్ర సృష్టించే దిశగా స్టాక్ మార్కెట్.. సెన్సెక్స్ 600 పాయింట్ల లాభం

పరోక్షంగా ఎన్ని మాటలు అనుకున్నాకూడా.. ఎదురు పడినప్పుడు ఆప్యాయంగా పలకరించుకోవడం మంచిగా అనిపించిందని తెలిపారు. హరీష్‌ రావు బీజేపీ పై ఎన్ని విమర్శలు చేసినా.. రఘునందన్‌ రావు బీఆర్‌ఎస్‌ పై నిప్పులు చెరిగినా ఎదురెదు పడినప్పుడు అందరూ సమానామనే అని నిరూపించారని బుజువు చేసుకున్నారు. వేరు వేరు పార్టీలో వున్నా న్యాయ పోరాటంతో స్నేహమైనా, విరోధమైనా ప్రజలకోసం పోరాడతామని ఇద్దరూ నిరూపించారు. పార్టీలపై విమర్శలు చేసుకున్నా.. ఈ ఇద్దరు నాయకులు ఎదురు పడినప్పుడు అందరూ ఒక్కటేనని నిరూపించారు. రఘునందన్ రావును, హరీష్ రావును ఒకే కార్యక్రమంలో చూసిన వాళ్లుందరూ ఆశ్చర్యానికి గురైనా.. ఆ ఇద్దరు నాయకులు చిరునవ్వుతో మాట్లాడుకున్న తీరు అందరిని ఆకట్టుకుంది.
Chandrababu: ‘నారా చంద్రబాబు నాయుడు అనే నేను’.. నాలుగో సారి సీఎంగా ప్రమాణ స్వీకారం