NTV Telugu Site icon

Uttam Kumar Reddy: ఉమ్మడి వరంగల్ జిల్లా రైతులను ఆదుకునేలా చర్యలు..

Uttam

Uttam

Uttam Kumar Reddy: హనుమకొండ జిల్లా దేవన్నపేట దగ్గర దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ పంప్ ను మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ మాట్లాడుతూ.. దేవాదుల ఫేస్- 3 యాక్టివిటీ రివ్యూతో పాటు పంప్ హౌస్ మోటార్ ప్రారంభించేందుకు వచ్చామన్నారు. దేవాదుల ప్రాజెక్టును పూర్తి చేసేందుకు కట్టుబడి ఉన్నాం.. దేవాదుల ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం నుంచి రావల్సిన నిధులు తెచ్చేందుకు కృషి చేస్తున్నామని ఆయన వెల్లడించారు. పంటలు ఎండిపోతున్నాయని దేవాదుల మోటార్ ను ప్రారంభిస్తున్నాం.. దీంతో 50 – 60 వేల ఎకరాలకు నీరు అందుతుంది.. ప్రాజెక్ట్ ఏజెన్సీని పనులు పూర్తి చేయాలని ఒత్తిడి తెస్తున్నామని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పుకొచ్చారు.

Read Also: Sourav Ganguly: రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్‌లో మార్పులు తీసుకురావాలి..

ఇక, ఉమ్మడి వరంగల్ జిల్లాలో రైతులను ఆదుకునేలా చర్యలు తీసుకుంటామని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఒక మోటార్ కు చెందిన పనులు చివరి దశకు వచ్చాయి.. ఈ రోజు రాత్రి వరకు మోటార్ ఆన్ చేస్తాం.. దీని వల్ల జనగామ, పాలకుర్తి నియోజకవర్గాల్లో పూర్తి స్థాయిలో నీరు అందుతుంది.. పరకాల, భూపాలపల్లి, వర్ధన్నపేట నియోజకవర్గాలకు కొంత సాగు నీరు అందిస్తామన్నారు. అయితే, కొన్ని సాంకేతిక కారణాలతో పంపు ఆన్ చేయలేక పోయాం.. రాత్రి పొద్దుపోయాకనైనా పంపు ఆన్ చేస్తాం.. ఎంత రాత్రైనా వరంగల్ లోనే ఉంటామని ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు.