Devadula Pipeline Leak: హన్మకొండ జిల్లాలోని సాయిపేటలో దేవాదుల ప్రాజెక్ట్ కు సంబంధించిన పైప్‌లైన్ లీకైంది. దీంతో 40 మీటర్ల ఎత్తు నీరు ఎగిసిపడి వృథాగా పోతోంది. అయితే, ధర్మసాగర్ పంప్‌హౌస్ నుంచి గండిరామారావు రిజర్వాయర్‌లోకి పైప్‌లైన్ విద్యుత్ సబ్ స్టేషన్ పవర్ ఫెయిల్యూర్ కావడంతో మోటర్ ట్రిప్ కావడంతో.. పైప్‌లైన్ డ్యామేజ్ అయ్యింది. అయితే, అధికారుల నిర్లక్ష్యం కారణంగానే నీరు వృథాగా పోతోందని రైతులు మండిపడుతున్నారు.
Read Also: Earthquake: భారత్‌లోనూ భూప్రకంపనలు.. హడలెత్తిపోయిన ప్రజలు
ఇక, ప్రభుత్వం పట్టించుకోకపోవడంతోనే దేవాదుల ప్రాజెక్ట్ కు చెందిన పైప్‌లైన్ అయిందని రైతులు ఆరోపిస్తున్నారు. పైప్‌లైన్ ను ఎప్పటికప్పుడు చెక్ చేసి మరమ్మత్తులు చేయాలని పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోకపోవడం వల్లే భారీగా నీరు వృధాగా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు.