హైదరాబాద్ లో బోనాలు ఎంత ఫేమస్సో.. హలీం కూడా అంతే ఫేమస్.. రంజాన్ నెల వచ్చిందంటే చాలు గల్లీకి ఒకటి హలీం స్టాల్ కనిపిస్తుంది.. ఆ రుచికి ఫిదా అవ్వని వాళ్లు ఉండరు.. ఇక రంజాన్ మాసం రావడానికి ఒక నెల మాత్రమే ఉంది.. అప్పుడు హలీం దొరకడం కాస్త కష్టమే.. ఈ సారి హలీమ్ డిమాండ్‌ను తీర్చడానికి హోటళ్లు సిద్ధమయ్యాయి.. ఇప్పటికే హైదరాబాద్ వీధులు సందడిగా మారాయి . అయితే ఈ సంవత్సరం వినియోగదారులకు హలీమ్ ధరలు షాక్ ఇవ్వనున్నాయి..
హలీం ధరలు పెరగనున్నాయని హలీం తయారీదారులు చెబుతున్నారు.. హలీమ్ ధరలు రూ.30 నుండి రూ. 40 వరకు పెరుగుతాయని హోటళ్ల వ్యాపారులు అంచనా వేస్తున్నారు. ప్రత్యేక హలీమ్‌లోని అవసరమైన డ్రై ఫ్రూట్స్, మటన్, గుడ్లు మరియు నెయ్యి వంటి పదార్థాల ధరల పెరుగుదల కారణంగా హలీమ్ ధరలు కూడా కాస్త పెరగనున్నాయని వ్యాపారులు చెబుతున్నారు..
గత ఏడాది , క్లాసిక్ హలీమ్ ధర రూ. 200 మరియు రూ. 250 మధ్య ఉంది. అయితే ఏ ఏడాది 300 వరకు పెరిగే అవకాశం ఉంది.. ఈ ఏడాది హలీం లవర్స్ కు షాకే… అయినా కొనకుండా ఉండరు.. ఆ రుచిని ఆస్వాదించాలంటే ఖర్చు పెట్టక తప్పదు.. ప్రస్తుతం మార్కెట్ లో వెల్లుల్లి, అల్లం ధరలతో పాటుగా మాంసం ధరలు కూడా భారీగా పెరిగిన సంగతి తెలిసిందే..