NTV Telugu Site icon

Hail rain: ఆ జిల్లాల్లో వడగళ్ల వాన! ఆందోళనలో రైతులు

Hail Rain

Hail Rain

Hail rain: తెలంగాణలో రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు పలుచోట్ల తేలికపాటి వర్షం కురిసింది. భారీ వర్షం, ఈదురు గాలులకు పలుచోట్ల చెట్లు నేలకూలాయి. నేడు, రేపు కూడా రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. వర్షాలు కురిసే సమయంలో 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించింది. విదర్భ పశ్చిమ ప్రాంతం నుంచి కర్ణాటక వరకు 1500 మీటర్ల ఎత్తులో గాలులతో ద్రోణి ఏర్పడిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మరోవైపు, భారతదేశంలోని దక్షిణ మరియు ఆగ్నేయ ప్రాంతాల నుండి తెలంగాణలోకి తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నాయి. దీని ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు.

Read also: HAIR TIPS: చుండ్రు సమస్యను చిటికెలో మాయం చేసే పిండి ఇదే..!

ఈరోజు, రేపు హైదరాబాద్ సహా పరిసర జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. పలు జిల్లాల్లో సగటున 7 సెంటీమీటర్ల నుంచి 12 సెంటీమీటర్ల వరకు ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తుందని తెలిపారు. ఆదిలాబాద్, మంచిర్యాల, కుమ్రంభీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, సిద్దిపేట, మహబూబ్ నగర్ హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. పలుచోట్ల వడగళ్ల వాన కురుస్తుందని అధికారులు తెలిపారు.

బుధవారం తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. నిన్న రాష్ట్రంలో సగటున 2.32 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. . సాధారణంగా వర్షాకాలంలో ఈ తరహా వర్షపాతం నమోదవుతుందని అధికారులు తెలిపారు. అత్యధికంగా సిద్దిపేట జిల్లా మిరుదొడ్డిలో, వికారాబాద్ జిల్లా మోమిన్ పేటలో 9 సెంటీమీటర్లు, భువనగిరిలో 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని తెలిపారు. మంగళవారం రాత్రి హైదరాబాద్‌లో 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వర్షాల ప్రభావంతో రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. వడగళ్ల వానతో రాష్ట్రంలో భారీ పంట నష్టం వాటిల్లింది. వరి, మొక్కజొన్నతో పాటు బత్తాయి, మామిడి, నిమ్మ వంటి ఉద్యాన పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ధాన్యం రాళ్లలో తడిసిపోయింది. పంట చేతికొచ్చే సమయంలో వరుణుడు బీభత్సం సృష్టిస్తుండటంతో రైతులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఇప్పుడు మళ్లీ రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
Uppal skywalk: ఉప్పల్ స్కైవాక్ ప్రారంభానికి సిద్ధం.. ప్రత్యేకతలివే