NTV Telugu Site icon

ఈటల ఓడిపోవడం ఖాయం.. ఆ దేవుడు కూడా గెలిపించలేడు..!

Gutha Sukender Reddy

Gutha Sukender Reddy

మాజీ మంత్రి ఈటల రాజేందర్‌పై ఫైర్ అయ్యారు శాసనమండలి మాజీ ఛైర్మన్‌, టీఆర్ఎస్‌ నేత గుత్తా సుఖేందర్‌రెడ్డి… ఈటల రాజేందర్ తనని తాను రాజకీయంగా నాశనం చేసుకున్నారని వ్యాఖ్యానించిన ఆయన.. రాజకీయాల్లో ఆత్మహత్యలే తప్ప- హత్యలుండన్నారు.. ఈటలకి సీఎం కేసీఆర్ అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారని మీడియా చిట్‌చాట్‌లో గుర్తుచేసిన గుత్తా.. మరోవైపు.. దేశవ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోడీ గ్రాఫ్ పడిపోయిందన్నారు.. మొన్న 5 రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో బీజేపీకి పరాభవం ఎదురయ్యిందన్న ఆయన.. ఈటల ఆత్మరక్షణ కోసం కాదు-ఆస్తులు రక్షణ కోసమే బీజేపీలోకి వెళ్తున్నారంటూ ఎద్దేవా చేశారు.. అంతేకాదు.. హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో ఈటల ఓడిపోవడం ఖాయం.. ఆయన్ని ఆ దేవుడు కూడా గెలిపించలేరు అని జోస్యం చెప్పారు.. మరో 20 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీయే అధికారంలో ఉంటుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేసిన గుత్తా.. 2026 ఎన్నికల్లో రిజర్వేషన్లు మారుతాయని.. నియోజకవర్గల డి- లిమిటేషన్ 2026లో పూర్తిఅవుతుందని తెలిపారు.