Site icon NTV Telugu

Sangareddy Crime: సంగారెడ్డిలో దారుణం.. చెరువులో గురుకుల విద్యార్థి మృతదేహం

Sangareddy Crime

Sangareddy Crime

Sangareddy Crime: సంగారెడ్డి జిల్లా దారుణం చోటుచేసుకుంది. నారాయణఖేడ్ గురుకుల విద్యార్థి అదృశ్యంమైన ఘటన విషాదంగా మారింది. రెండు రోజుల క్రితం మామిడి పళ్ళ కోసం గురుకులం నుంచి నలుగురు విద్యార్థులు బయటకు వెళ్లారు. ముగ్గురు తిరిగి రాగా 9వ తరగతి విద్యార్థి మహేష్ కనిపించకుండా పోయాడు. గురుకుల పాఠశాల సిబ్బంది నిన్న తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. అనంతరం పోలీసులకు మహేష్‌ కనిపించకుండా పోయాడని తెలుపడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కాగా.. ఇవాల రామసముద్రం చెరువులో విద్యార్థి మహేష్ శవమై కనిపించాడు. చెరువులో అనుమానాస్పద స్థితిలో లభ్యమైన మహేష్ డెడ్ బాడీ ఉండటంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. నిన్న కనిపించడం లేదని గురుకుల పాఠశాల సిబ్బంది సమాచారం ఇచ్చారని ఇంతలోనే చెరువులో సవమై కనిపించాడని వాపోయారు. ముగ్గురిని బయటకు ఎలా పంపిస్తారని ప్రశ్నించారు. నిన్న నారాయణఖేడ్ లో కనిపించకుండా పోయిన మహేష్‌ ఇవాల రామసముద్రం చెరువులో ఎలా చనిపోయాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతదూరం ఎలా ప్రయాణిస్తాడు? ఎవరైనా తనను చంపేసి ఇక్కడ పడేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. తన కొడుకు మహేష్‌ మృతికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.

Read also: Brown Rice: రోజూ బ్రౌన్ రైస్ తింటే పొట్ట తగ్గుతుందా? నిజమెంత?

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ టి మండల కేంద్రంలోని గురుకులంలో 9వ తరగతి చదువుతున్న ఎస్. శ్రీవాణి అనారోగ్యంతో మృతి చెందింది. రావు గారి గ్రామం. తల్లిదండ్రులు సమ్మయ్య, లలిత వ్యవసాయం చేస్తూ ఇద్దరు కుమార్తెలతో కుటుంబాన్ని పోషిస్తున్నారు. శ్రీవాణి పెద్ద కూతురు, ఝాన్సీ చిన్న కూతురు. శ్రీవాణి మెడ నొప్పి, నీరసంగా ఉందని చెప్పడంతో ఇన్‌ఛార్జ్ ప్రిన్సిపాల్ సునీత, విద్యార్థినిని సిర్పూర్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మంచిర్యాల ఏరియా ఆస్పత్రికి తరలించారు. హాస్టల్ సిబ్బంది అతన్ని అంబులెన్స్‌లో కాగజ్ నగర్‌లోని ముప్పై పడకల ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ పరీక్షించిన డాక్టర్ శ్రీవాణి అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు.
Nolen: ఓపెన్‌ హీమర్ సినిమా గురించి వస్తున్న వార్తలనీ పుకార్లే…

Exit mobile version