Site icon NTV Telugu

Guns Seized in Kamareddy: కామారెడ్డిలో నాటు తుపాకుల కలకలం..

Natu Tupaki

Natu Tupaki

Guns Seized in Kamareddy: ఒకప్పుడు ఉన్న దేశ తుపాకులు ఈ మధ్య కాలంలో పెద్దగా కనిపించడం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా కనిపించే నాటు తుపాకులు ఇటీవలి కాలంలో కనుమరుగయ్యాయి. పోలీసుల దాడుల్లో మచ్చ లేదు. కానీ ఇటీవలి కాలంలో గ్రామీణ ప్రాంతాల్లో అక్కడక్కడా వెలుగులు కనిపిస్తున్నాయి. అడవి జంతువులను వేటాడేందుకు ఉపయోగిస్తారు. పోలీసుల దాడులతో మాయమైన ఈ తుపాకులు మళ్లీ తెలుగు రాష్ట్రాల్లో చోటు దక్కించుకుంటున్నాయి. ఇక తాజాగా కామారెడ్డి జిల్లాలో కలకలం సృష్టించాయి.

read also: Giriraj Singh: లవ్ జిహాద్ రూపంలో ఉగ్రవాదం కుట్ర పన్నుతోంది

కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం సంగీతం గ్రామంలో నాటు తుపాకుల కలకలం రేపాయి. సంతోష్ సింగ్ అనే వ్యక్తి ఇంట్లో గంజాయి సాగు చేస్తున్నారనే సమాచారంతో ఎక్సైజ్ అధికారులు తనిఖీలకు వెళ్లారు. తనికీలు చేసిన అధికారులకు షాక్‌ తిన్నారు. ఆప్రాంతంలో.. పలు గంజాయి మొక్కతో పాటు ,రెండు నాటు తుపాకులు పట్టుబడ్డాయి. ఇంట్లోనే నాటు తుపాకులు తయారు చేయడమే కాకుండా.. జంతువులు వేలకు ఉపయోగిస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. దీంతో ఎక్సైజ్ అధికారులు నిందితున్ని అదుపులో తీసుకుని బాన్సువాడ పోలీసులకు అప్పగించారు.
Astrology: నవంబర్ 30, బుధవారం దినఫలాలు

Exit mobile version