రాచకొండ పోలీస్ కమిషనరేట్ ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని కర్ణంగూడలో కాల్పుల కలకలం సృష్టిస్తున్నాయి.. కర్ణంగూడ గ్రామ సమీపంలో ఓ రియాల్టర్ గాయాలపాలయ్యాడరు.. తనపై ఎవరో తుపాకీతో కాల్పులు జరిపారని స్థానికులకు తెలిపాడు రియాల్టర్.. ఇక, స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. బాధితుడిని ఆస్పత్రికి తరలించారు.. ఘటనా స్థలంలో ఉన్న స్కార్పియోకు రక్తం మరకలు గుర్తించారు.. అయితే, దీనిపై భిన్నకథనాలున్నాయి.. కర్ణంగూడ గ్రామ సమీపంలో స్కార్పియో కారు అదుపుతప్పినట్టుగా కూడా చెబతున్నారు.. ఒకరికి తీవ్రగాయాలు కాగా, ఆసుపత్రికి తరలించారు.. అయితే, తనపై ఎరవో గన్‌తో కాల్పులు జరిపారని రియాల్టర్ శ్రీనివాస్‌రెడ్డి చెబుతున్నారు.. స్కార్పియో కారుకు రక్తం మరకలు ఉన్నాయి.. కానీ, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. రియాల్టర్ శ్రీనివాస్‌రెడ్డి.. హైదరాబాద్‌లోని బీఎన్‌రెడ్డి నగర్‌కు చెందిన వ్యక్తిగా తెలుస్తోంది.
Read Also: Pending Challans: క్లియరెన్స్‌కు విశేష స్పందన.. నిమిషానికి 700 చలాన్లు క్లియర్