NTV Telugu Site icon

కూక‌ట్‌ప‌ల్లిలో కాల్పుల క‌ల‌క‌లం.. భారీ దోపిడీ..

gun firing

gun firing

హైద‌రాబాద్‌లోని కూక‌ట్‌ప‌ల్లిలో కాల్పులు క‌ల‌క‌లం సృష్టించాయి.. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వ‌ద్ద కాల్పుల‌కు తెగ‌బ‌డ్డారు దుండ‌గులు… ఏటీఎం మిషన్‌లో డబ్బులు రీఫిల్ చేస్తుండగా కాల్పులు జ‌రిపిన ఆగంత‌కులు… సెక్యూరిటీ గార్డుతో పాటు ఏటీఎం సిబ్బందిపై కాల్పులు జ‌రిపి.. అంది‌న‌కాడికి డ‌బ్బును దోసుకెళ్లారు.. ఈ కాల్పుల్లో ఇద్ద‌రు తీవ్ర‌గాయాల‌పాల‌య్యారు.. ఏటీఎంలో డ‌బ్బులు రీఫిల్ చేస్తుండ‌గా కాల్పులు జ‌రిపార‌ని సెక్యూరిటీ సిబ్బంది చెబుతున్నారు.. కాల్పుల్లో గాయ‌ప‌డిన ఇద్ద‌రినీ స‌మీపంలోని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు.. దోపిడీకి పాల్ప‌డిన ముఠా కోసం గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టారు.. అదికూడా ర‌ద్దీగా ఉండే కూక‌ట్‌ప‌ల్లి ఏరియాలో.. ప‌ట్ట‌ప‌గ‌లే ఈ దోపిడీకి పాల్ప‌డ్డారంటే.. వాళ్లు ప‌క్కా స్కెచ్ వేసిన‌ట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. మొత్తంగా.. కాల్పులు జ‌రిపి.. భారీగా న‌గ‌దును దోచుకెళ్ల‌డం.. క‌ల‌క‌లం సృష్టిస్తోంది..