తెలంగాణను వణికించిన ‘గులాబ్’ తుఫాన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణను గులాబ్ తుఫాన్ వణికించింది. సైక్లోన్ ప్రభావంతో ఆకాశానికి చిల్లు పడిందా అన్న విధంగా కురిసిన వర్షానికి.. పలు జిల్లాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ నగరంపై మరోసారి వరుణుడు తన ప్రతాపాన్ని చూపించాడు. నిన్న రాత్రి నుంచి విరామం లేకుండా కురిసిన కండపోత వానకు భాగ్యనగరం ముగినిపోయింది. హైదరాబాద్‌లోని చాలా ప్రాంతాలు జలమయం అయ్యాయి. సాయంత్రం నాలుగు గంటలకే నగరంలో చిమ్మ చీకట్లు అలుముకున్నాయి. జడివానతో కాలనీలు నీట మునిగాయి. ఇళ్లలోకి నీళ్లొచ్చి చేరాయి. రోడ్లపై పెద్ద ఎత్తున వరద నీరు నిలిచిపోయింది. పలు ప్రాంతాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు గండిపేట జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో ప్రాజెక్ట్ నాలుగు క్రస్ట్ గేట్లు ఎత్తి మూసి నదిలోకి విడుదల చేశారు అధికారులు. జాగ్రత్తగా ఉండాలని మూసి పరివాహక ప్రాంత వాసులకు హెచ్చరికలు జారీ చేశారు.రాజన్న సిరిసిల్లలోనూ వర్షాలు విరుచుకుపడ్డాయి. సిరిసిల్ల పట్టణం పాత బస్టాండ్ జలమయం అయ్యింది. వేముల వాడ పట్టణంలోని పలు కాలనీల్లో వరద చేరింది.
Also Read
- Bus Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. రైల్వే బ్రిడ్జిని ఢీ కొట్టిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు.!
- CM Revanth Reddy : సైబరాబాద్‌కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
- TG20 League: 'హైదరాబాద్ ఈ ఛాంపియన్స్' ఫైనల్ స్క్వాడ్.. ఇదిగో పూర్తి లిస్ట్..
- CM Revanth Reddy : మూసీ, మెట్రోపై రగడ.. కిషన్ రెడ్డిని టార్గెట్ చేసిన సీఎం
ఇక వేములవాడ-మల్లారం హనుమాజీపేట నక్క వాగు ఉధృతంగా ప్రవహించడంతో అధికారులు రాకపోకలు నిలిపివేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనూ వానలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వైరా, మధిర నియోజకవర్గాల్లోని చాలా ప్రాంతాలు వరద గుప్పిట్లో చిక్కుకున్నాయి. అశ్వాపురం, కరకగూడెం మండలాల్లో వాగులు పొంగి పొర్లుతున్నాయి. 20కిపైగా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోగా.. వందలాది ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో వర్షాలు దంచికొడుతున్నాయి. వాగులు ఉగ్రరూపం దాల్చాయి. ఎల్లంపల్లి, కడెం, సాత్నాల, మత్తడి వాగు ప్రాజెక్టులు నిండుకుండలను తలపిస్తున్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లోని దాదాపు 20గ్రామాలకు జిల్లా కేంద్రంతో సంబంధాలు తెగిపోయాయి.డు సమీక్షిస్తున్నారు.
తాజావార్తలు
-
Dhavaleswaram Barrage: ధవళేశ్వరం బ్యారేజీకి కొత్తరూపు.. 46 ఏళ్ల తర్వాత ఆధునికీకరణ పనులకు శ్రీకారం!
-
Korean Kanakaraju : ‘కొరియన్ కనకరాజు’ రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్… మరో సర్ప్రైజ్ కూడా
-
Realme X3 SuperZoom: 64MP క్వాడ్ కెమెరాలతో.. రియల్మీ ఎక్స్3 సూపర్ జూమ్.. రూ.14 వేల కన్నా తక్కువ ధరకే
-
Astrology: ఈ 4 రాశులవారు కోపం వచ్చినప్పుడు అసలు కంట్రోల్లో ఉండరట.. మీ రాశి కూడా ఉందా?
-
Jay Shah: పాకిస్థాన్ కెప్టెన్‌తో ‘జై షా’ కరచాలనం.. ఏకిపారేస్తున్న నెటిజన్స్.!
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!