పోలీస్ ఉద్యోగాలకు ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైన పదిరోజుల్లో 3,52,433 దరఖాస్తులు వచ్చాయి. పోలీస్, ఎక్సైజ్, రవాణాశాఖల్లోని వివిధ విభాగాల్లో కలిపి మొత్తం 17,291 పోస్టుల భర్తీకి పోలీస్ నియామక మండలి ఇటీవల మొత్తం ఆరు నోటిఫికేషన్లు విడుదల చేసిన విషయం తెలిసిందే. మే 2 నుంచి తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ నియామక మండలి (టీఎస్‌ఎల్పీఆర్బీ) ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ మొదలు కాగా తొలి పదిరోజుల్లో అభ్యర్థులు పెద్ద సంఖ్యలో దరఖాస్తు చేసుకుంటున్నట్టు టీఎస్‌ఎల్పీఆర్బీ చైర్మన్ వీవీ శ్రీనివాసరావు తెలిపారు. మే 20న రాత్రి 10 గంటల వరకు ఆన్‌లైన్ దరఖాస్తులకు గడువు ఉటుందని, దాదాపు సగం రోజుల్లో మూడున్నర లక్షల దరఖాస్తులు అందాయని వివరించారు. చివరి వారంలో రద్దీ పెరిగే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
ఈ నెల రెండో తేదీ (సోమవారం) నుంచి తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ నియామక మండలి (టీఎస్‌ఎల్పీఆర్బీ) ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ మొదలైంది. రెండు రోజుల్లోనే అభ్యర్థులు పెద్ద సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నట్టు టీఎస్‌ఎల్పీఆర్బీ చైర్మన్ వీవీ శ్రీనివాసరావు తెలిపారు. అయితే, చివరి రోజుల్లో రద్దీ పెరిగే అవకాశం ఉండటంతో అభ్యర్థులు ముందు నుంచే దరఖాస్తు చేసుకోవడంపై దృష్టిని కేంద్రీకరిస్తున్నారు. గతానికి భిన్నంగా తొలి రెండు రోజుల్లోనే 32 వేల దరఖాస్తులు చేరడం పోలీసు ఉద్యోగాల పట్ల అభ్యర్థుల్లో నెలకొన్న పోటీకి నిదర్శనంగా కనిపించింది. దరఖాస్తు చేస్తున్న అభ్యర్థుల నుంచి రద్దీకి తగినట్లు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియలో ఎటువంటి సాంకేతిక ఇబ్బందులు తలెత్తకుండా టీఎస్‌ఎల్పీఆర్బీ అన్ని ఏర్పాట్లు చేసింది.
SPDCLలో 70 ఏఈ పోస్టులు.. నేటి నుంచి దరఖాస్తులు
ఇక.. దక్షిణ విద్యుత్తు పంపిణీ సంస్థలో (SPDCL) 70 అసిస్టెంట్ ఇంజనీర్, 201 సబ్ ఇంజినీర్, 1000 లైన్‌మెన్ పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రారంభమైంది. అసిస్టెంట్ ఇంజినీర్ (ఏఈ) పోస్టులకు నేటినుంచి దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. అభ్యర్థులు జూన్ 3 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. జూలై 17న రాత పరీక్ష నిర్వహిస్తారు. ఈనేపథ్యంలో జూలై 11 నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు tssouthern power.cgg.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.
