జూన్ నెలలోనే 9,200 గ్రూప్ 4 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఆర్థిక, అరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. అందరూ అన్ని పోస్టులకు పరీక్ష రాసేందుకు వీలుగా ఒక దాని తర్వాత మరోక నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నామని వివరించారు. గురువారం వికారాబాద్ జిల్లా పరిగిలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..
ఈ ఏడాదిలోనే అన్ని ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నామని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ ఢిల్లీలో పోరాడి 95 శాతం ఉద్యోగాలు స్థానికులకే దక్కేలా చేశారని అన్నారు. పోలీసు ఉద్యోగాల్లో 33 శాతం మహిళలకు రిజర్వేషన్ కల్పించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దే అన్నారు. ఇటీవల సివిల్స్ లో ర్యాంకులు సాధించిన వారిని స్ఫూర్తిగా తీసుకుని నిరుద్యోగ అభ్యర్థులు పోటీ పరీక్షలకు సిద్ధం కావాలని సూచించారు. ఈ సందర్భంగా పరిగిలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ను హరీశ్ రావు ప్రారంభించారు. అనంతరం పరిగి సీహెచ్ సీని సందర్శించారు. అంతకు ముందు పరిగి వద్ద మంత్రి హరీశ్ రావుకు స్థానిక ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి, టీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు.
Ktr Twitter: హరీశ్‌రావు చేసిన ట్వీట్‌కు.. కేటీఆర్ రీట్వీట్ ?