Site icon NTV Telugu

Minister KTR : అమెరికాలో ఘనస్వాగతం..

Telangnaa IT Minister KTR Got Grand Welcome At America Tour.

మంత్రి కే తారకరామారావు కి అమెరికాలో ఘనస్వాగతం లభించింది. తెలంగాణ రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు తీసుకువచ్చే లక్ష్యంతో అమెరికాలో మంత్రి కే. తారకరామారావు పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు హైదరాబాద్ నుంచి అమెరికాలోని లాస్ ఏంజిల్స్ నగరానికి చేరుకున్న మంత్రికి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ కార్యకర్తలు నాయకులు, తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ఎన్నారైలు భారీగా ఘనస్వాగతం పలికారు. ఎయిర్‌పోర్టులో మంత్రి కేటీఆర్ కి పూల బొకేలు అందించి స్వాగతం తెలిపారు. మంత్రి కేటీఆర్‌ లాస్ ఏంజిల్స్ లో తనకు స్వాగతం పలికిన ఎన్నారైలతో కాసేపు ముచ్చటించారు.


తెలంగాణ అభివృద్ధి, తెలంగాణ ప్రభుత్వ కార్యక్రమాల పైన ప్రత్యేకంగా మంత్రి కేటీఆర్ మాట్లాడారు. మన ఊరు మన బడి కార్యక్రమానికి సంబంధించిన వివరాలను తెలిపారు. ఇక్కడ ఉన్న ఎన్నారైలు ఈ కార్యక్రమంలో పెద్దఎత్తున పాల్గొనాలని మంత్రి కేటీఆర్ చేశారు. అమెరికాలో పనిచేస్తున్న తెలంగాణ ప్రాంతానికి చెందిన బిడ్డలు తెలంగాణ ప్రభుత్వం తరపున రాయబారులుగా వ్యవహరించాలని కోరారు.

Exit mobile version