NTV Telugu Site icon

Governor Tamilisai: గిరిజనులు ఆరోగ్యం కాపాడుకోవాలి

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ నిత్యం బిజీగా వుంటారు. అటు పాలనా వ్యవహారాల్లో బిజీగా వున్నా.. వివిధ సామాజిక సేవాకార్యక్రమాల్లో పాల్గొంటూ వుంటారు. స్వతహాగా డాక్టర్ అయిన తమిళిసై ఆరోగ్యం పట్ల అవగాహన పెంచుకోవాలంటారు. నల్లమలలో పర్యటించిన గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ అక్కడి గిరిజనులతో మమేకం అయ్యారు. వారి సాధక బాధకాలను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈరోజు మరిచిపోలేను, ఎప్పటికీ మరిచిపోను అన్నారు. గిరిజనులు, ఆదివాసీలకు సేవ చేయడం సంతోషంగా అనిపిస్తుంది. మంచి చదువు, మంచి ఆరోగ్యంతో ఉండాలని ఎప్పుడూ కోరుకుంటున్నాను. ఓ వైద్యురాలిగా మీ జీవన స్థితిగతుల పట్ల ఆందోళనగా ఉంటుంది. మీరంతా మంచి పౌష్టికాహారం తీసుకోవాలి.

న్యూట్రిషన్ పథకం చాలా ప్రత్యేకమైనది. టూ వీలర్ అంబులెన్స్, రాజశ్రీ కోళ్లు, మందులు అందించడం ఆనందం కలిగిస్తుంది. అప్పాపూర్, భౌరాపూర్ లో మాదిరిగా పథకాలు ఇతర పెంటలకు విస్తృతం చేసేలా చర్యలు తీసుకుంటాం. మీరంతా ఆరోగ్యం పట్ల శ్రద్ద తీసుకోవాలి. ప్రభుత్వ పథకాలు అందేలా అధికారులు పని చేయాలి. నా ప్రయత్నంలో సహకరించిన రెడ్ క్రాస్, కలెక్టర్, తదితర శాఖలకు అభినందనలు అన్నారు తమిళి సై సౌందరరాజన్.

తెలంగాణ రాజ్ భవన్ తరుపున నాగర్ కర్నూలు జిల్లాలో 6 చెంచు గిరిజన గ్రామాలను దత్తత తీసుకున్న తెలంగాణ గవర్నర్ తమిళిసై. 6 గ్రామాల అభివృద్ధికి రూ.50 లక్షలు నిధులను కేటాయించామని తెలిపిన గవర్నర్ తమిళి సై. 6 గ్రామాలలో విద్య, వైద్యం, వంటి సదుపాయాలపై ప్రత్యేక దృష్టి. శ్రీశైల మల్లికార్జునస్వామిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు గవర్నర్ తమిళిసై. కరోనా నుండి ప్రజలు బయటపడాలని సంతోషంగా ఉండాలని స్వామి అమ్మవారిని కోరుకున్నా అన్నారు గవర్నర్ తమిళిసై సుందరరాజన్.