Site icon NTV Telugu

Governor Tamilisai: వైద్య వృత్తి కష్టమైనా డిప్రెషన్ వద్దు

వైద్య వృత్తి కష్టమైనా డిప్రెషన్ కి గురికావద్దని వైద్యవిద్యార్ధులకు సూచించారు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్. బీబీనగర్ ఎయిమ్స్ లో 2021 – 2022 ఎంబీబీఎస్ బ్యాచ్ విద్యార్థులకు వైట్ కోట్ సెరిమోనీ కార్యక్రమానికి హాజరైన గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ వైద్యవిద్యార్ధులకు హితోపదేశం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలో కోలుకోవాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నా అన్నారు గవర్నర్. ఆయుష్‌మాన్ భారత్, జన ఔషధి పథకాలను సద్వినియోగం పరుచుకోవాలన్నారు.

https://ntvtelugu.com/rk-book-publishing-seize-case-highcourt-angry-on-police/

బీబీ నగర్ ఎయిమ్స్ తెలంగాణ గౌరవ చిహ్నం అన్నారు. ప్రతి రాష్ట్రంలో ఇలాంటి ఆసుపత్రులు కావాలని కోరుకుంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు అందించడం కష్టం అనిపించినా జాగ్రత్తగా చేయాలన్నారు తమిళిసై. వైట్ కోటు అనేది సేవకు,స్వచ్ఛతకు చిహ్నం. వైద్య వృత్తి కష్టమైనా డిఫ్రెషన్ కు లోనుకాకుండా ముందుకు సాగాలి. వైద్య విద్యార్థులు పరిశోధన, విద్య, ఆటలలో అన్ని రంగాల్లో పాల్గొంటూ సంతోషంగా వైద్య విద్యను అభ్యసించాలి. ప్రధాన మంత్రి మోడీ ప్రజల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని పనిచేస్తున్నారు. దేశ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు ప్రధాని మోడీ. ఆయుష్మాన్ భారత్ లోనే కాదు ఆసియాలోనే అతిపెద్ద పథకం అన్నారు తమిళి సై సౌందరరాజన్.

Exit mobile version