Governor Tamilisai: సిద్దిపేట జిల్లాలో గవర్నర్ తమిళిసై పర్యటన కొనసాగుతుంది. కార్తీకమాసంలో మల్లికార్జున స్వామి వారిని గవర్నర్ దర్శించుకున్నారు. ఆలయ అధికారులు గవర్నర్ కు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. తర్వాత మల్లికార్జున స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉండాలని పూజలు చేశారు. అనంతరం గవర్నర్ మాట్లాడుతూ.. కొమురవెల్లికి రైల్వేస్టేషన్ కావాలని భక్తులు కోరారని అన్నారు. వీలైనంత త్వరలో కొమురవెల్లికి రైల్వేస్టేషన్ వచ్చేలా ప్రయత్నిస్తానని గవర్నర్ తమిళిసై హామీ ఇచ్చారు. నా సర్వదికారాలు ఉపయోగించి కృషి చేస్తా అన్నారు.
Read also: Purandeswari : రాష్ట్ర ప్రభుత్వం అభివృద్దిని విస్మరించింది
హైదరాబాద్ వెళ్ళగానే కేంద్ర రైల్వే శాఖ మంత్రితో మాట్లాడుతా అని తెలిపారు. అనంతరం అక్కడి నుంచి బైరాన్ పల్లి బయలు దేరారు. బైరాన్ పల్లిలో రైతాంగ సాయుధ పోరాట అమరవీరుల స్థూపానికి నివాళులర్పించిన అనంతరం బైరాన్ పల్లి గ్రామం నిజంగా వీర బైరాన్ పల్లి అంటూ పొగడ్తలతో ముంచెత్తారు. ఫ్రీడమ్ ఫైటర్స్ ను కలవడం సంతోశంగా ఉందని అన్నారు. రాజ్ భవన్ కి అఖిల అనే అమ్మాయి రావడంతో నాకు విషయం తెలిసిందని అన్నారు. ఈ గ్రామాన్నీ టూరిస్ట్ ప్లేస్ గా చేయాడానికి కృషి చేస్తానని అన్నారు గవర్నర్. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డితో మాట్లాడుతానని తెలిపారు. ఫ్రీడమ్ ఫైటర్స్ కి పెన్షన్ రావడానికి కృషి చేస్తా అని గవర్నర్ తమిళసై ఈ సందర్భంగా తెలిపారు.
Special Shows: స్టార్స్ ఇమేజ్ పై స్పెషల్ షోస్ దెబ్బ