Site icon NTV Telugu

Governor Tamilisai: రజక బంధు ప్రకటించిన తర్వాతే టీఆర్‌ఎస్ మునుగోడు ఎన్నికల ప్రచారం చేపట్టాలి

Governor Tamilisai

Governor Tamilisai

Governor Tamilisai: రజక బంధు ప్రకటించిన తర్వాతే టీఆర్‌ఎస్ పార్టీ మునుగోడు ఎన్నికల ప్రచారం చేపట్టాలని గవర్నర్ తమిళిసై డిమాండ్ చేశారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత చాకలి ఐలమ్మకు సరైన గౌరవం దక్కడం లేదని రాష్ట్ర గవర్నర్ తమిళి సాయి సౌందర్ రాజన్ ఆరోపించారు. హైదరాబాద్ లోని లోయర్ ట్యాంక్ బండ్ లో తెలంగాణ రజక అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన చాకలి ఐలమ్మ 127వ జయంతి వేడుకల్లో గవర్నర్ తమిళి సాయి పాల్గొని, తెలంగాణ సాయుధ పోరాట యోధులను చాకలి ఐలమ్మ కీర్తించారు. అనంతరం మాట్లాడుతూ.. చాకలి ఐలమ్మ త్యాగం గొప్పదని, నిజాం నవాబు జమీందార్లకు వ్యతిరేకంగా పోరాడిన గొప్ప యోధుడని తెలిపారు. అణగారిన ప్రజల కోసం అలుపెరగని పోరాటం చేసిన మహిళ చాకలి ఐలమ్మ అని, ఆమె త్యాగం గొప్పదని అన్నారు.

Read also: Ktr condolence to joguramanna family: జోగు రామన్నను పరామర్శించిన మంత్రి కేటీఆర్

నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన గొప్ప యోధురాలు చాకలి ఐలమ్మ అని రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. భూ నిర్వహణ విషయంలో పటేల్‌, పట్వారీలను ఎదిరించిన యోధుడు ఆయన. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత చాకలి ఐలమ్మకు సరైన గౌరవం దక్కడం లేదని ఆరోపించారు. ట్యాంక్ బండ్‌పై చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఇంతవరకు ఏర్పాటు చేయలేదని కేసీఆర్‌ విమర్శించారు. దళిత, గిరిజన బందుల మాదిరిగానే రజకులకు కూడా రజక బంధు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. రజక బంధు ప్రకటించిన తర్వాతే టీఆర్‌ఎస్ పార్టీ మునుగోడు ఎన్నికల ప్రచారం చేపట్టాలని గవర్నర్ తమిళిసై డిమాండ్ చేశారు.
Italy PM: ఇటలీ తొలి మహిళా ప్రధానిగా జార్జియా మెలోని!

Exit mobile version