NTV Telugu Site icon

RTC Bill: ఆర్టీసి బిల్లును సిద్ధం చేసిన సర్కార్.. ఆమోదం తెలుపని గవర్నర్..!

Rtc Bill

Rtc Bill

RTC Bill: తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ఆర్టీసీ బిల్లుకు ఆమోదం తెలపలేదు..! దీంతో ఈ బిల్లును అసెంబ్లీలో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఆర్థిక బిల్లు కావడంతో ప్రభుత్వం దానిని గవర్నర్‌కు పంపింది. అయితే ఈ బిల్లుకు రాజ్‌భవన్‌ నుంచి ఆమోదం లభించలేదు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గత నెల 31న జరిగిన తెలంగాణ కేబినెట్ తీర్మానం చేసింది. ఈ మేరకు ఈ నెల 1న బిల్లు రూపొందించారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ఈ బిల్లును ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే అది మనీ బిల్లు కావడంతో ప్రభుత్వం దానిని గవర్నర్ ఆమోదం కోసం రాజ్‌భవన్‌కు పంపింది. అయితే రాజ్‌భవన్‌ నుంచి బిల్లుకు ఇంకా ఆమోదం లభించలేదు. ఈ బిల్లుకు రాజ్‌భవన్‌ ఆమోదం లభిస్తే ఈరోజు ప్రవేశపెట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. అయితే రాజ్‌భవన్‌ నుంచి అనుమతి రాకపోవడంతో ప్రభుత్వం ఈ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టలేదు.

Read also: Andy Flower: ఆర్‌సీబీ హెడ్‌ కోచ్‌గా జింబాబ్వే మాజీ క్రికెటర్.. ఇక కప్పు ఖాయం!

రేపు తెలంగాణ అసెంబ్లీ సమావేశానికి ఒక్క రోజు మాత్రమే మిగిలి ఉంది. అవసరమైతే అసెంబ్లీ సమావేశాలను ఒకరోజు పొడిగించవచ్చు. రేపటిలోగా రాజ్‌భవన్‌ నుంచి ఆమోదం లభిస్తే ఆర్టీసీ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. గతంలో గవర్నర్ తిరస్కరించిన మూడు బిల్లులతో పాటు మరో నాలుగు బిల్లులను అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది. కానీ ఆర్టీసీ బిల్లుకు గవర్నర్ నుంచి అనుమతి రాలేదు. ఈ విషయంలో గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది. కాగా, ఈ బిల్లును అసెంబ్లీలో ఆమోదించి గవర్నర్‌కు పంపే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. తెలంగాణ ఆర్టీసీకి చెందిన 43 వేల మందికి పైగా ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తూ గత నెల 31న జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని ఆర్టీసీ ఉద్యోగులు చాలా కాలంగా డిమాండ్‌ చేస్తున్నారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ముసాయిదా బిల్లును రూపొందించింది. ఈ బిల్లును అధికారులు ఈ నెల 1న రాజ్‌భవన్‌కు పంపించారు. అయితే ఈ బిల్లుపై రాజ్‌భవన్‌ నుంచి ఇప్పటివరకు ఎలాంటి సమాచారం రాలేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
KTR: ఐటీ, ఉద్యోగ కల్పనలో తెలంగాణే నెంబర్ వన్‌