Site icon NTV Telugu

YS Sharmila: నాకు ఏమైనా జరిగితే ప్రభుత్వానిదే బాధ్యత

Sharmila Tamilasai

Sharmila Tamilasai

YS Sharmila: నాకు ఏమైనా జరిగితే ప్రభుత్వానిదే బాధ్యత అన్నారు వైఎస్‌ఆర్‌టీపీ అధినేత్రి షర్మిల. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తాలిబన్ లా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. నేను పెద్ది సుదర్శన్ రెడ్డిని ఏమి అనలేదని స్పష్టం చేశారు. ఆయన మగతనంతో నాకేం పని, పెద్ది సుదర్శన్ రెడ్డి.. మగతనం ఆమె భార్య కు తెలుస్తోంది.. నాకేమి అవసరం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్ షర్మిల. టీఆర్ఎస్ నేతలు ప్రెస్ మీట్లు పెట్టి బెదిరింపులకు దిగుతున్నారని వైఎస్‌ షర్మిల మండిపడ్డారు. చెప్పుతో కొడతా అని ఒక నికృష్ట మంత్రిని మాత్రమే అన్నానని ఆమె పేర్కొన్నారు. రెండు రోజులుగా జరిగిన ఘటనను పూర్తిగా గవర్నర్‌ కు వివరించానని తెలిపారు. ఉద్దేశ్యపూర్వకంగానే పాదయాత్రను అడ్డుకున్నారని అన్నారు.

Read also: YS Sharmila: చెప్పుతో కొడతా అని ఒక నికృష్ట మంత్రిని మాత్రమే అన్నాను

ట్రాఫిక్ ఇబ్బంది లేకున్నా తనను అరెస్ట్ చేశారని ఆరోపించారు. వాహనంలో ఉండగానే తీసుకువెళ్లారని తెలిపారు. తన పార్టీ వాళ్ళను పోలీసులు కొట్టారని, పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ చేయాలని, టీఆర్ఎస్ ప్రభుత్వం కుట్ర చేసిందని పేర్కొన్నారు. ట్రాఫిక్ వాయిలెన్స్ కేసు పెట్టి రిమాండ్ ఎలా అడగతారు? అని ప్రశ్నించారు. పాదయాత్రను ఆపే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోందని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ ఒక్క హామీ కూడా నిలబెట్టుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో కేసీఆర్ రిచేస్ట్ పొలిటికల్ ఫ్యామిలీ అంటూ సంచలన వ్యాఖ్యలుచేశారు. నాలుగు లక్షల అప్పుల ఊబిలో తెలంగాణను నెట్టారని ఆరోపించారు. ప్రగతి భవన్ పై రైడ్స్ చేయాలని డిమాండ్ చేశారు. పాదయాత్రను యజ్ఞంలా చేస్తున్నామని అన్నారు షర్మిల. టీఆర్ఎస్ నేతలు ప్రెస్ మీట్లు పెట్టి బెదిరింపులకు దిగుతున్నారని, మునుగోడు, హుజురాబాద్ లో టీఆర్ఎస్ ఎంత ఖర్చు పెట్టిందో విచారణ జరపాలని వైఎస్ షర్మిల డిమాండ్‌ చేశారు.

Exit mobile version