Free Rice:కొత్త సంవత్సరం వచ్చేసింది.. జనవరి నెల ప్రారంభమై 10 రోజులు గడిచినా.. సంక్రాంతి పండుగ సమీపిస్తున్నా తెలంగాణ రాష్ట్రంలో ఇంకా రేషన్ పంపిణీ చేయడం లేదు ఏంటి? అంటూ రేషన్‌కార్డు దారులు అంతా ఎదురుచూస్తున్నారు.. సాధారణంగా 5వ తేదీ నుంచి డీలర్లు బియ్యం పంపిణీ ప్రారంభిస్తారు.. కానీ, ఈ నెల మాత్రం 10వ తేదీ దాటినా బియ్యం పంపిణీ ప్రారంభం కాకపోవడంపై విమర్శలు వెళ్లువెత్తాయి.. ఈ సమయంలో శుభవార్త చెప్పింది తెలంగాణ ప్రభుత్వం.. నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉచిత బియ్యం పంపిణీ చేయనున్నట్టు పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్.. పేదల కోసం నిరంతరం తపించే వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్ అని పేర్కొన్న ఆయన.. కరోనా కష్టకాలంలో 10 కిలోల బియ్యం ఉచితంగా అందించిన ప్రభుత్వం తమదన్నారు.. అయితే, ఈ నెలలో సాఫ్ట్‌వేర్ మాడిఫికేషన్ వల్లే రేషన్ పంపిణీలో కొంత జాప్యం జరిగినట్టు వెల్లడించారు..
Read Also: Baby Powder: జాన్సన్ అండ్ జాన్సన్‌కు ఊరట.. బేబీ పౌడర్ తయారీ, విక్రయాలకు అనుమతి..
ఇక, కేంద్ర ప్రభుత్వం ఇవ్వని 92 లక్షల మందికి సైతం ఉచితంగా 6 కిలోల బియ్యం అందజేయనున్నట్టు ప్రకటించారు మంత్రి గంగుల కమలాకర్.. గతంలోనే అదనంగా 3 కిలోలు ఇచ్చిన నేపథ్యంలో మార్చి వరకూ యూనిట్ కి 5 కిలోల చొప్పున పంపిణీ చేస్తామన్నారు.. రేషన్ పంపిణీలో ఆలస్యంపై విపక్షాలు చేస్తున్న విమర్శలను తిప్పికొడుతూ.. పెట్రోల్, డీజిల్, గ్యాస్ సిలిండర్ ధరలు పెంచి పేదల్ని నిలువుదోపిడీ చేస్తున్న వాళ్లు పేదల గురించి మాట్లాడడం విడ్డూరం అని మండిపడ్డారు మంత్రి గంగుల కమలాకర్.. కాగా, దేశంలోని రేషన్‌కార్డులకు కేంద్ర ప్రకటించిన ఐదు కిలోల ఉచిత బియ్యం పంపిణీ డిసెంబర్ నెలతో ముగిసింది. తర్వాత ఆ ఉచిత రేషన్ బియ్యాన్ని మరో ఏడాది పాటు పొడిగిస్తున్నట్లు కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కార్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఇచ్చే బియ్యం కోటాలో కోత పెట్టేందుకు సిద్ధమైనట్టు ప్రచారం జరిగింది.. తర్వాత ఆ నిర్ణయాన్ని విరమించుకుంది. జనవరి నెల నుంచి కేంద్రం ఇచ్చే ఆ ఐదు కిలోల బియ్యాన్ని తిరిగి పంపి చేసేందుకు సిద్ధం అయ్యారు.. జాతీయ ఆహార భద్రత కార్డుదారులకు ఒక్కొక్కరికి ఐదు కిలోల చొప్పున బియ్యం ఇచ్చినట్లుగానే.. రాష్ట్ర ఆహార భద్రత కార్డులు కలిగిన వారికి కూడా 5 కిలోల చొప్పునే ఇవ్వనున్నట్లు పేర్కొంది.. దీంతో జనవరి నెల నుంచి సంవత్సరం పాటు రేషన్ కార్డుదారులకు ఒక్కొక్కరికి 5 కిలోల ఉచిత బియ్యం పంపిణీ చేయనున్నారు.. కాగా, గతంలో కేంద్రం జారీచేసిన జాతీయ ఆహార భద్రత కార్డులకు 5 కిలోలు ఇస్తే, రాష్ట్ర ప్రభుత్వం మరో కిలో కలిపి 6 కిలోలు బియ్యం ఇస్తూ వచ్చింది.. అలాగే రాష్ట్ర ఆహార భద్రత కార్డులకు 6 కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేసింది.. ఇకపై అన్ని కార్డులపైనా ఒక్కొక్కరికి 5 కిలోల చొప్పునే బియ్యం పంపిణీ చేస్తామని రాష్ట్ర పౌర సరఫరాల కమిషనర్ జారీచేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు..